Borewell: బోరు బావిలో పడిన చిన్నారి.. 15 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్..
కొందరి నిర్లక్ష్యం మరికొంత మందికి శాపంగా మారుతుంది. కొంత మంది బోరు వేస్తారు. నీరు పడకపోతే ఆ బోరును అలానే వదిలేస్తారు. కానీ ఇది చాలా ప్రమాదమని వారు గుర్తించరు. తాజాగా ఓ చిన్నారి బోరు బావిలో పడి మృతి చెందింది. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. గుజరాత్ ఆమ్రేలిలోని సుర్గాపరా గ్రామంలో చిన్నారి బోర్ బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది. బోరుబావిలో పడిన చిన్నారని రక్షించేందుకు 15 గంటల పాటు రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.
జూన్ 14న సుర్గాపరా గ్రామంలో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి బోర్ బావిలో పడింది. కొంత సమయం తర్వాతా చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో చిన్నారి బోరు బావిలో పడినపోయినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే రెవెన్యూ, పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు హుటాహుటీన ఘటనా స్థలికి చేరుకున్నాయి.

చిన్నారి బోరు బావిలో 45 నుంచి 50 అడుగుల లోతులో బాలిక ఉన్నట్లు గుర్తించారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు రెస్య్కూ ఆపరేషన్ ప్రారంభించారు. బోరుకు సమంతరంగా జేసీబీ సహాయంతో తవ్వడం మొదలు పెట్టారు. అదే సమయంలో చిన్నారికి ఆక్సిజన్ అందించేందుకు ఆక్సిజన్ పైపును బోరు బావిలోకి వదిలారు. ఈ క్రమంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అయినప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. సుమారు 15 గంటల పాటు ఆపరేషన్ కొనసాగింది.
శునివారం తెల్లవారుజాము వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. రెస్క్యూ సిబ్బంది బోరు బావి నుంచి పాపను బయటకు తీసుకొచ్చారు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు నెలకున్నాయి. చిన్నారి ఎలా చనిపోయింది వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహిస్తే తెలుస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications