మెడికల్ కాలేజ్ లో ఆవులను పట్టుకుని అమ్మేస్తున్న అదే కాలేజ్ ఉద్యోగి, అసలు మ్యాటర్ ?
కొచ్చి/తిరువనంతపురం: పశువులను దొంగిలించి విక్రయించే కేసులు కేరళలో రోజురోజుకు పెరుగుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. ఇప్పుడు కేరళలో వైద్య కళాశాల సిబ్బంది వీధిలో వెలుతున్న పశువులను పట్టుకుని వ్యాపారులకు విక్రయించిన ఘటన వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఈ పశువుల అక్రమాల రాకెట్ వెనుక ఓ సిస్టమేటిక్ నెట్‌వర్క్ పని చేస్తుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేరళ మెడికల్ కాలేజీ చుట్టూ తిరుగుతున్న పశువులను పట్టుకుని విక్రయిస్తున్న మెడికల్ కాలేజీ సిబ్బందిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని ఎర్నాకులం ప్రభుత్వ వైద్య కళాశాల డ్రైవర్ బిజు మాథ్యూ అరెస్టు అయిన నిందితుడు. ఎర్నాకుళం మెడికల్ కాలేజీ క్యాంపస్ పరిసర ప్రాంతాలతో పాటు ఆ చుట్టుపక్కల చాలా మంది తమ ఆవులు తప్పిపోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చింది.

ఒకే ప్రాంతం నుంచి ఇన్ని ఆవులు ఎందుకు కనిపించకుండా పోతున్నాయన్న అనుమానంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు, ఇతర సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొందరు వ్యక్తులు పశువులకు నీరు, గడ్డి, ఇతర ఆహారం ఇస్తున్నట్లు సీసీటీవీల్లో వెలుగు చూసింది. కేసును మరింత లోతుగా విచారించిన పోలీసులు మెడికల్ కాలేజీ డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేశారు.
ఎర్నాకులం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. క్యాంపస్ చుట్టుపక్కల ఉన్న ఆవులకు నీరు, మేత ఇచ్చి వాటిని పట్టుకుని వ్యాపారులకు ఇచ్చేవాడు. ఇందుకు సంబంధించి పశువుల వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పోలీసుల విచారణలో నిందితుడు బిజు మ్యాథ్యూ కలకలం రేపే విషయాలు బయటకు చెప్పాడు.

దీన్ని పెట్టుబడిగా పెట్టుకున్న బిజు మాథ్యూ మరికొందరి సాయంతో ఆవులను పట్టుకుని విక్రయించేవాడు. వ్యాపారులు ఆ పశువును చంపేసి వాటి మాంసం విక్రయిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. గతంలో మెడికల్ కాలేజీ డ్రైవర్‌గా పనిచేస్తున్న బిజు మాథ్యూ అదే వ్యాపారంలోకి దిగి ఇటీవల కొత్త వాహనాలు కొనుగోలు చేశాడు. ఇప్పుడు అతని వ్యాపారం కేవలం పశువుల దొంగతనాలకే పరిమితం కాలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications