బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీలోని ఎమ్మెల్యే సీటులో అనామకుడు, ఏం జరిగిందంటే ?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి శుక్రవారం సిద్ధరామయ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో భద్రతా లోపం ఉన్నట్లు స్పష్టంగా వెలుగు చూడటం కలకలం రేపింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఓ అజ్ఞాత వ్యక్తి హాయిగా విధాన సౌధలోని ఎంట్రీ ఇచ్చి అసెంబ్లీలోకి ప్రవేశించి ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే సీటులో కూర్చున్నాడు. ఎమ్మెల్యే టైపులో దర్జాగా కుర్చున్న వ్యక్తిని కరియప్ప అలియాస్ తిప్పేరుద్రగా గుర్తించి విచారిస్తున్నామని సీసీబీ పోలీసులు తెలిపారు.
దాదాపు 15 నిమిషాల పాటు ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న కరియప్ప తర్వాత అక్కడా ఇక్కడా తిరిగారు. గురుమిట్కల్ ఎమ్మెల్యే శరణగౌడ్ కుందకూర్ దీనిని గమనించి స్పీకర్ కు సమాచారం అందించారు. దేవదుర్గ ఎమ్మెల్యే కారమ్మ స్థానంలో కూర్చున్నట్లు సమాచారం. ఈ విషయమై ఎమ్మెల్యే శరణగౌడ్ కుందకూరే మాట్లాడుతూ తాను మొదట సీనియర్ ఎమ్మెల్యే జీటీ. దేవెగౌడ దగ్గరకు వెళ్లి అన్నా మీకు ఆయన తెలుసా అని అడిగానని, ఆయన ఎవరో తెలియదని జీటీ దేవేగౌడ చెప్పారని ఎమ్మెల్యే శరణగౌడ అన్నారు.

తరువాత తాను కరియప్ప దగ్గరకు వెళ్లి మీరు ఏ నియోజక వర్గం ఎమ్మెల్యే అని అడగ్గా మొళకాల్మూరు ఎమ్మెల్యే అని చెప్పారని, తనకు అనుమానం వచ్చి ఈ విషయాన్ని స్పీకర్ యూటీ. ఖాదర్ దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే శరణప్ప కుందకూర్ మీడియాకు చెప్పారు. యుటి ఖాదర్ కు కూడా అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సిద్ధరామయ్య బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో సభలో కూర్చున్న ఓ వ్యక్తిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీబీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శరణప్ప అరెస్ట్ చేసిన వ్యక్తిని విచారిస్తున్నారు. 70 ఏళ్ల వృద్ధుడు కరియప్ప విధానసౌధలో సెక్యూరిటీ గార్డులను మాయ చేసి లోపలికి వెళ్లాడు. దీనిని పోలీస్ కమిషనర్ శరణప్ప సీరియస్‌గా తీసుకున్నారు.

బడ్జెట్ సమర్పణ సందర్భంగా కరియప్ప నేరుగా శాసనసభలో అడుగుపెట్టారు. ఎంట్రన్స్ ఏరియాలో కరియప్పను విధాన సౌధ మార్షల్స్ ప్రశ్నించగా నేనొక ఎమ్మెల్యే, ఆ విషయం మీకు తెలుసా అంటూ వారి మీద కేకలు వేశారు. తరువాత మార్షల్స్ ఐడీ కార్డు అడగ్గా నేను మొళకాల్మూరు ఎమ్మెల్యే, ఎందుకు మీరు నన్నే ఐడీ కార్డు అడుగుతున్నారు, నా ఐడీ కార్డు కారులో ఉందని అని గట్టిగా మాట్లాడటంతో మార్షల్స్ ఆయన్నున విధాన సౌధలోకి వదిలేశారని పోలీసులు అన్నారు.
విధాన సౌధ లోపలికి వెళ్లిన కరియప్ప నేరుగా అసెంబ్లీలోకి వెళ్లి ఎమ్మెల్యే సీట్లో కూర్చున్నాడు. ఈ సమయంలో ఎమ్మెల్యే శరణగౌడ్‌పై అనుమానం వచ్చి ప్రశ్నించగా నేను మొళకాల్మూరు ఎమ్మెల్యేనే అని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన శరణగౌడ్ సెక్రటరీ ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకురావడంతో మార్షల్స్ ద్వారా వ్యక్తిని బయటకు పంపించారు. విధానసౌధ పోలీసులు కరియప్పను అదుపులోకి తీసుకుని తరువాత సీసీబీ పోలీసులకు అప్పగించారు. కరియప్ప ఎందుకు విధానసౌధలోకి వెళ్లి ఎమ్మెల్యే సీటులో కుర్చున్నాడు ? అని అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications