company: భార్య, పిల్లలను చంపేసి కంపెనీ ఓనర్ ఏం చేశాడంటే ?, ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో !
రాత్రి స్నేహితుల వాట్సాప్ గ్రూప్ లో ఓ కంపెనీ ఓనర్ ఓ లెటర్ పోస్టు చేశాడు. స్నేహితులు ఇంటికి చేరుకునే లోపు ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు శవాలైనారు.
న్యూఢిల్లీ: వ్యాపారం చేస్తున్న వ్యక్తి పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్నాడు. దంపతులు చాలా సంతోషంగా జీవించారు. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితమే అతను ఐఎస్ఓ సర్టిఫికెట్ ఇచ్చిన కంపెనీని ప్రారంభించి వ్యాపారం చేస్తున్నాడు. అయితే తరువాత పరిస్థితులు తారుమారు అయ్యాయి. అతని దగ్గర చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఉద్యోగులే అతన్ని మోసం చేశారు. కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. రాత్రి అతను స్నేహితుల వాట్సాప్ గ్రూప్ లో ఓ లేఖ పోస్టు చేశాడు. స్నేహితులు ఇంటికి చేరుకునే లోపు ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు శవాలైనారు.

కంపెనీ యజమాని
దేశ రాజధాని ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో రాజేష్ (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఏడు సంవత్సరాల క్రితం సునీత అనే యువతిని రాజేష్ వివాహం చేసుకున్నాడు, రాజేష్, సునీత దంపతులకు 5 సంవత్సరాలు, 4 నెలల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజేష్ చాలా సంవత్రాల క్రితం ఐఏఎస్ఐ సర్టిఫికేషన్ ఉన్న కంపెనీని ప్రారంభించి వ్యాపారం చేసేవాడు.

మొత్తం తారుమారు అయ్యింది
కరోనా వైరస్ దెబ్బతో లాక్‌డౌన్ కాలంలో రాజేష్ కంపెనీ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిందని సమాచారం. వ్యాపారం దిగజారడంతో అప్పుల బాధతో ఉన్న రాజేష్ తన వ్యాపారాన్ని ఆపివేసి కంపెనీని మూసేశాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో భార్య సునీత, 5 ఏళ్ల కొడుకు, 4 నెలల చిన్నారిని కత్తితో పొడిచి చంపిసిన రాజేష్ తరువాత అతని మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు చేసుకోవాలని ప్రయత్నించాడు.

ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో ?
రాజేష్ అతని భార్య, పిల్లలను హత్య చెయ్యడానికి ముందు అతని స్నేహితుల వాట్సాప్ గ్రూప్‌లో ఓ పోస్ట్‌ను పోస్ట్ చేశాడు. నేను చాలా అప్పుల్లో ఉన్నాను. కోవిడ్ దెబ్బ, లాక్‌డౌన్ సమయంలో నా వ్యాపారం చాలా నష్టపోయింది. నా ఉద్యోగులు నన్ను మోసం చేసి నా కంపెనీ ఖాతాదారులను వేరే కంపెనీలకు పంపారు, ఆ విధంగా నా కంపెనీ పూర్తిగా దివాలాతీసింది, నా కంపెనీ మాజీ ఉద్యోగులే నన్ను మోసం చెయ్యడంతో తాను ఆర్థికంగా నష్టపోయానని, అందుకే ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకుంటున్నానని రాజేష్ ఫ్రెండ్స్ వాట్సాప్ లో పోస్టు చేశారు.

ఒక్కడే మిగిలాడు
రాజేష్ చేసిన పోస్టు చూసిన అతని స్నేహితులు షాక్‌కు గురై వెంటనే రాజేష్ ఇంటికి బయలుదేరి తరువాత అతని సోదరుడికి సమాచారం అందించారు. ప్రెండ్స్ వెళ్లే సమయానికి రాజేష్ భార్య సునీత, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో చనిపోయి కనిపించారు. రాజేష్ ఒక్కడే ప్రాణాలతో పోరాడుతున్నాడు. రాజేష్ ను రక్షించి ఆసుపత్రిలో చేర్చారు.

దంపతులు ఇద్దరూ చెప్పలేదు
ఆసుపత్రిలో రాజేష్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాజేష్ మీద హత్య కేసు నమోదు చేశారు. రాజేష్, సునీత దంపతులు వారి సమస్య గురించి ఎప్పుడూ చెప్పుకోలేదని. తాము ఎప్పటిలాగే సంతోషంగా ఉన్నామని ఇంతకాలం చెప్పారని, సమస్యలు ఉన్నాయని ముందుగా చెప్పిఉంటే ఏదో ఒక పరిష్కారం చిక్కిఉండేదని ఇరు వైపుల కుటుంబ సభ్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications