పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు, కాంగ్రెస్ ఎంపీ అనుచరుడు అందర్, కోల్డ్ స్టోరేజ్ లో దాక్కొన్న లీడర్ !
రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. కర్ణాటక అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించుకుని సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాసీర్ హుస్సేన్ ఎంపీగా విజయం సాధించన వెంటనే బెంగళూరులోని విధాన సౌధలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని టీవీల్లో రావడం కలకలం రేపింది.
బెంగళూరులోని విధాన సౌదలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుస్సేన్ మద్దతుదారుడు మహమ్మద్ నాశిపుడిని బుధవారం) అర్థరాత్రి కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని హావేరి జిల్లాలోని మోతెబెన్నూరు సమీపంలోని ఎస్‌ఏఎన్ కోల్డ్ స్టోరేజ్ లో తలదాచుకున్న మహమ్మద్ నాశిపుడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరు, బ్యాడగి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. వాయిస్ కంపారిజన్ విచారణ నేపథ్యంలో మహమ్మద్ నాశిపుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని బెంగళూరుకు తీసుకెళ్లారు. విధాన సౌధలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన కేసులో డిక్లరేషన్ వ్యవహారంపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుస్సేన్ మద్దతుదారు మహమ్మద్ నాశిపుడిని ఇదే కేసులో విచారణ నిమిత్తం అతన్ని పోలీసులు బెంగళూరుకు తీసుకెళ్లారు.

మహమ్మద్ నాశిపుడి పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారని బ్యాడగి బీజేపీ నేతలు ఆరోపించి అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాసీర్ సాబ్ సాబ్ జిందాబాద్ అని అరిచానని, పాకిస్థాన్ జిందాబాద్ అని తాను అరవలేదని మహమ్మద్ నాశిపుడి అంటున్నాడు. మహమ్మద్ నాశిపుడి మీడియాతో మాట్లాడుతూ తన తల్లి మీద ఒట్టు తాను పాకిస్థాన్ జిందాబాద్ అంటూ దేశద్రోహ నినాదాలు చేయలేదని అన్నాడు. అయితే సీసీటీవీల్లో రికార్డు అయిన క్లిప్పింగ్ వాయిస్ మెసేజ్ తో మహమ్మద్ నాశిపుడి వాయిస్ మ్యాచ్ అయితే మాత్రం సీన్ వేరే రకంగా ఉంటుందని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications