హైదరాబాద్ వ్యాపారి చిక్కాడని భర్తతో కలిసి భార్య ఏం చేసిందంటే, అర్ద కోటీతో !

బెంగళూరు: విదేశాల నుంచి భారత్‌కు మద్యం ఇప్పిస్తానని నమ్మించి హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.67 లక్షలు తీసుకుని వివిధ రాష్ట్రాలకు విక్రయిస్తున్న కేరళకు చెందిన దంపతులను బెంగళూరులోని హెచ్‌ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళకు చెందిన సుబీష్ పి.వాసు, అతని భార్య శిల్పా బాబులను అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి కెఆర్‌ కమలేష్‌ ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

నిందితులు సుబీష్, అతని భార్య శిల్పా బాబు 2022లో బిజినెస్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ ఎల్‌ఎల్‌పి కంపెనీ పేరుతో బెంగళూరులోని మారతహళ్లిలో ఓ కార్యాలయం ప్రారంభించారు. తరువాత హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కమలేష్‌కు ఫోన్ చేసి మద్యం వ్యాపారం గురించి మాట్లాడాడు. ఈ డీలింగ్ ప్రకారం కమలేష్ హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకుని మారత్హళ్లిలోని సుబీష్, శిల్పా నిర్వహిస్తున్న కంపెనీ కార్యాలయాన్ని సందర్శించి విదేశీ మద్యం వ్యాపారం గురించి చర్యలు జరిపారు.

couple

ఈ సమయంలో నిందితులు శిల్పా, సుబీష్ వ్యాపారి కమలే్ కు మాయమాటలు చెప్పారు. విదేశాల నుంచి భారత్‌కు మద్యం తీసుకొచ్చి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తామని, మీరు కర్ణాటక రాష్ట్రంలో సబ్ డీలర్‌షిప్‌ను పొందాలని, విదేశీ మద్యం అమ్మకాల వ్యవహారాలన్నీ మేమే చూసుకుంటామని, ఒక్కో బాటిల్‌కు రూ. 120 చొప్పున లాభం ఇస్తామని, ప్రతిరోజు లక్షల రూపాయలు లాభాలు వస్తాయని చెప్పారు. నిందితుల మాటలు నమ్మిన హైదరాబాద్ వ్యాపారి కమలేష్ నిందితులతో కలిసి విదేశీ మద్యం వ్యాపారం చేసేందుకు అంగీకరించాడు.

ఆ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అడ్వాన్స్ డిపాజిట్ గా రూ . 50 లక్షలు ఇవ్వాలని నిందితులు సుబీష్, శిల్పా దంపతులు వివిధ దశల్లో కమలేష్ నుంచి వారి కంపెనీ ఖాతాకు రూ. 67 లక్షలు బదిలీ చేయించుకున్నారు. మరోవైపు, మద్యం వ్యాపారం చేసేందుకు కమలేష్ 'రెడ్ గ్రూ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో కంపెనీని ప్రారంభించాడు. నిందితుల కంపెనీతో కమలేష్ ఒప్పందం కూడా చేసుకున్నాడు. కమలేష్, శిల్పా, సుబీష్ కలిసి బాండు పేపర్లలో సంతకాలు చేశారు.

couple

కొన్ని నెలల తర్వాత కూడా నిందితులు మద్యం వ్యాపారం గురించి కమలేష్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇదేమిటని చాలాసార్లు కమలేష్ నిందితుల నుంచి ఆరా తీసినా ఈరోజు, రేపు అంటూ చాలా కాలం గడిపేశారు. ఆ తర్వాత ఈ లావాదేవీ తాను చే్యలేనని, నెల రోజుల్లో నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయాలని కమలేష్‌ నిందతులకు చెప్పాడు. అయితే నెల రోజులు గడిచినా డబ్బులు తిరిగి ఇవ్వలేదు.

ఆ తర్వాత కమలేష్ మొబైల్ ఫోన్ కాల్ రిసీవ్ చెయ్యకుండా సుబీష్, శిల్పా దంపతులు మాయం అయ్యారు. తరువాత కమలేష్ బెంగళూరులోని మారతహళ్లిలోని నిందితుల కంపెనీ వద్దకు వెళ్లగా అప్పటికే ఆ కంపెనీ మూతపడిందని, నిందితులు పరారైనారని తెలుససుకుని షాక్ అయ్యాడు. అనంతరం హైదరాబాద్ వ్యాపారి కమలేష్ హెచ్‌ఏఎల్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆపరేషన్‌ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఓ జాతీయ పార్టీకి కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తితో, కర్ణాటకకు చెందిన కొందరు రాష్ట్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు, అధికారులు, రాజకీయ నేతలతో శిల్పా బాబు ఫొటోలు తీసుకోవడమే కాకుండా సభలు, సమావేశాల్లో వేదికను పంచుకుందని, రాజకీయ నాయకుల పేర్లు అడ్డం పెట్టుకుని పలువురిని పట్టించి మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

నిందితులు గతంలో కూడా మద్యం, తాజా చేపల వ్యాపారం, చైన్‌లింక్‌ మోడల్‌ వ్యాపారం చేస్తూ పలువురిని నమ్మించి కోట్లాది రూపాయలు లూటటీ చేశారని విచారణలో వెలుగు చూసింది. గతంలో మోసం కేసులో బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించడంతో బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా నిందితులు ఇలాగే అందరిని మోసం చేస్తూనే ఉన్నారని బెంగళూరు పోలీసుల విచారణలో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+