తమిళనాడు క్రిమినల్ పై బెంగళూరులో అటాక్, జస్ట్ మిస్, మాజీ సీఎం కొడుకు క్లోజ్ ఫ్రెండ్ !
బెంగళూరు/చెన్నై/మధురై: తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ సొంత సోదరుడు, ఆ పార్టీకి దూరంగా ఉంటున్న తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమారుడు, డీఎంకే మాజీ నేత ఎంకే. అళగిరి సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన పేరుమోసిన రౌడీపై బెంగళూరులో హత్యాయత్నం జరగడంతో అందరూ హడలిపోయారు.
తమిళనాడులోని మదురైకి చెందిన పేరుమోసిన రౌడీ వీకే. గురుస్వామి మూర్తిపై బెంగళూరులో దాడి జరగడం కలకలం రేపింది. లిటిగేషన్ భూమి విషయానికి సంబంధించి చర్చల కోసం గురుస్వామి సోమవారం విమానంలో సీక్రేట్ గా బెంగళూరు వచ్చారు. నిన్న ఫ్లైట్‌లో వచ్చిన గురుస్వామి బెంగళూరులోని బాణసవాడిలోని సుఖ సాగర్ హోటల్ లో బస చేశారు.

సుఖ సాగర్ హోటల్‌లో బస చేసిన గురుస్వామి సోమవారం సాయంత్రం ఇల్లు వెతుక్కోవడానికి హోటల్ లోనే ఉన్నాడు.
గురుస్వామి హోటల్ లోనే ఓ బ్రోకర్‌తో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో తమిళనాడు రిజిస్ట్రేషన్ కారులో వచ్చిన నలుగురైదుగురు వ్యక్తులు ఒక్కసారిగా హోటల్ రూమ్ లోకి వెళ్లి కొడవలితో గురుస్వామి మూర్తి మీద దాడికి పాల్పడ్డారు.
సుమారు ఐదుగురు వ్యక్తులు వేటకొడవళ్లు, కత్తులు, లాంగ్‌తో దాడి చేయడంతో గురుస్వామి మూర్తి తలకు బలమైన గాయాలు కావడంతో అతను కుప్పకూలిపోయాడు. దాడికి గురైన గురుస్వామి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. గురుస్వామి మూర్తి అతని 20 ఏళ్ల వయసులోనే క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నాడు. ప్రాణహాని నేపథ్యంతో గురుస్వామి మూర్తి ఎక్కడా బహిరంగంగా కనిపించకుండా తిరుగుతున్నాడు.
మదురైలో విద్వేషం పెంచుకున్న గురుస్వామి మూర్తికి శత్రువులు చాలా మంది ఉన్నారు. మదురైతో పాటు ఎక్కడికి వెళ్లినా గురుస్వామి మూర్తి బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పడుతున్నాడు. సోమవారం బెంగళూరులోని బనసవాడిలోని సుఖ సాగర్ హోటల్‌లో గురుస్వామి మూర్తి హత్యకు స్కెచ్ వేసిన తర్వాత నిందితులుడు దాడి చేసిన సమయంలో అతను ప్రాణాలతో తప్పించుకున్నాడు.
గురుస్వామి మూర్తితో ఉన్న వ్యక్తి ఆయన బాణసవాడిలోని సుఖ సాగర్ హోటల్ లో ఉన్న సమాచారం లీక్ చెయ్యడం వలనే దాడి చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానించారు. గురుస్వామి మూర్తి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈస్ట్ డివిజన్ డీసీపీ భీమశంకర్ గులేద్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలిస్తున్నారు. మొత్తం మీద తమిళనాడుకు చెందిన క్రిమినల్ పోలిటికల్ లీడర్ మీద బెంగళూరులో హత్యాయత్నం జరగడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications