ప్రియుడి కోసం కళ్ళలో కారం చల్లి కట్టుకున్న మొగుడ్ని కడతేర్చిన క్రిమినల్ పెళ్ళాం

సమాజంలో రోజురోజుకీ దారులు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భర్తలను భార్యలు హత మార్చుతున్న తీరు ప్రతి ఒక్కరు షాక్ కు గురయ్యేలా చేస్తుంది. ఇటీవల కాలంలో అత్యంత అమానవీయంగా మహిళలు భర్తలను హతమార్చడం ఆడవారిలో పెరుగుతున్న క్రిమినల్ నేచర్ కు అద్దం పడుతుంది. ఇక తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఓ క్రిమినల్ పెళ్ళాం దాష్టీకానికి అద్దం పట్టింది.

ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది ఓ ఇల్లాలు. కడ శెట్టి హళ్లి గ్రామానికి చెందిన శంకర్ మూర్తి తన వ్యవసాయ క్షేత్రంలోని ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆయన భార్య సుమంగళ తిప్టూరులోని కల్పతరు బాలికల హాస్టల్ లో వంట మనిషిగా పనిచేస్తుంది. అయితే అక్కడ ఆమెకు కరదాలుశాంతే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

A criminal wife who pour mirchi powder in husband eyes and killed him for her boyfriend

Take a Poll

కళ్ళలో కారం చల్లి భర్తను చంపిన భార్య
తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి పథకం ప్రకారం హతమార్చింది. జూన్ 24వ తేదీన భర్త శంకర్ మూర్తి కళ్ళల్లో సుమంగళ కారంపొడి చల్లింది. అనంతరం కర్రతో దారుణంగా కొట్టి గొంతుపై కాళ్లతో తొక్కి చంపేసింది.

గోనెసంచిలో భర్త శవం మూట కట్టి బావిలో పడేసిన ఇల్లాలు
ఆ తర్వాత మృతదేహాన్ని ఒక గోనెసంచిలో మూటకట్టి దాదాపు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పొలంలోని బావిలో పడేసింది.
ఇక శంకరమూర్తి కనిపించకపోవడంతో మొదట నొణవినకెరె పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదయింది. అయితే ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు శంకర్ మూర్తి మంచం వద్ద కారంపొడి ఆనవాళ్లు పెనుగులాట జరిగిన ఆనవాళ్ళు గుర్తించి, అనుమానంతో సుమంగళ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు.

భర్తను హతమార్చానని ఒప్పుకున్న భార్య
దీంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు సుమంగళను అరెస్ట్ చేసి ప్రశ్నించగా, చివరకు నిజం ఒప్పుకుంది. తన భర్తను తానే హతమార్చినట్టు పోలీసుల ముందు చెప్పింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+