చనిపోయిన వధువుకు వరుడు కావలెను.. ఈ ప్రేతాత్మల పెళ్లి సందడి ఎక్కడంటే!
కర్ణాటకలో వరుడు కావలెను.. అనే ఓ ప్రకటన ఇప్పుడు వైరల్‌గా మారింది. అందుకు కారణం తెలిస్తే మీరైనా షాక్ అవుతారు. మూడు దశాబ్దాల క్రితం మరణించిన తమ కూతురు కోసం పెళ్లికొడుకును వెతుకుతోంది ఓ కుటుంబం. అంతేకాదు, వరుడుకు కావాల్సిన అర్హతలతోపాటు, వరుడు వారికి నచ్చితేనే వివాహానికి సమ్మతిస్తారట! మరి ఇంతకీ వధువు తరపునవారికి ఎలాంటి వరుడు కావాలి? ఈ పెళ్లి తతంగం వెనుక అసలు కథేంటి? తెలుసుకోవాలంటే కర్ణాటకలోని పుత్తూరు వెళ్లాల్సిందే!
సరిగ్గా 30 సంత్సరాల క్రితం మరణించిన తమ కుమార్తెకు వరుడు కావలెను అని కర్ణాటకలోని పుత్తూరులో ఓ కుటంబం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో బంగే రా గోత్రం.. కులల్ కులంలో పుట్టిన తమ కుమార్తెకు తగిన వరుడు కావలెను అని కోరారు. అలాగే, వధువు 30 సంవత్సరాల క్రితం మరణించిందని తెలిపారు. ఇదే కులంలో పుట్టి, వేరొక గోత్రమైనా పర్వాలేదని, 30 ఏండ్ల క్రితం మరణించి ఉంటే చాలని స్పష్టం చేశారు. ఈ ప్రకటన వైరల్ కావడంతో ఈ పెళ్లి తంతుపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నిజానికి, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని తులునాడు ప్రాంతంలో ఇలా మరణించినవారి ఆత్మలకు పెళ్లి చేసే ఆచారం ఎప్పటినుంచో ఉంది. ప్రేత మడువే అని పిలుచుకునే ఈ ఆచారంలో సాధారణ పెళ్లి తరహాలోనే వివాహ కార్యక్రమం జరిపిస్తారు.

త్వరలోనే పెళ్లి ముహూర్తం..
తాజా పెళ్లి ప్రకటనలో ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించడానికి వరుడు కుటుంబ సభ్యులు సమ్మతిస్తే సంప్రదించాలని ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ ప్రకటనకు మంచి స్పందనే వచ్చింది. దాదాపు యాభై మంది వరకూ వధువు కుటుంబ సభ్యలను సంప్రదించారట. వారిలో సరైన సంబంధాన్ని ఎంపిక చేసుకుని వరుడి ప్రేతాత్మతో తమ కుమార్తెకు వివాహం చేయనున్నామని, వివాహ తేదీని త్వరలోనే వెళ్లడిస్తామని వధువు కుటుంబ సభ్యలు తెలిపారు.












Click it and Unblock the Notifications