బెంగళూరు బంద్, టమోటో బాత్ చేస్తుంటే ప్రాణాలు కోల్పోయిన ఎలుక, పోలీసులకు !
బెంగళూరు: కావేరి జలాల కోసం కన్నడ సంఘాలు, రైతు సంఘాలు చేస్తున్న బెంగళూరు (bengaluru bandh) బంద్ కు ఐటీ హబ్ ప్రజలు సంపూర్ణంగా సహకరించారు. బెంగళూరు బంద్ కు (bengaluru bandh) రైతు సంఘాలు, కన్నడ సంఘాలతో పాటు అనేక స్వచ్చంద సంస్థలు, తమిళ సంఘాలు మద్దతు తెలపడంతో మంగళవారం ఉదయం నుంచి బెంగళూరు బంద్ (bengaluru bandh) లో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
తమిళనాడుకు కావేరి నదీజలాల విడుదలకు వ్యతిరేకంగా బెంగళూరులో (bengaluru) నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు బెంగళూరు (bengaluru)నగరం అంతటా పోలీసులు మోహరించారు. బెంగళూరు బంద్ (bengaluru bandh)సందర్బంగా బందోబస్తుకు కేటాయించిన పోలీసులకు హోటల్ నుంచి స్నాక్స్, భోజనాలు సరఫరా చేశారు.

బెంగళూరు (bengaluru) సిటీ పోలీసులకు ఇచ్చిన భోజనంలో చనిపోయిన ఎలుక కనిపించడం కలకలం రేపింది. మంగళవారం ఉదయం బెంగళూరు (bengaluru bandh)నగగరంలోని ఆర్ఎంసీ యార్డు పోలీస్‌స్టేషన్‌లో బందోబస్తులో ఉన్న యశ్వంత్‌పురం ట్రాఫిక్ పోలీసులకు తీసుకొచ్చిన భోజనంలో చనిపోయిన ఎలుక (rat) కనిపించడంతో సాటి పోలీసులు బిత్తపోయారు.
పోలీస్ శాఖ సరఫరా చేసిన లంచ్ ప్యాకెట్ తెరిచి చూడగా అందులో ఎలుక (rat) కనిపించడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసు సిబ్బందికి ఇచ్చే ఆహారంలో ఎలుకలు ఉన్నట్లు బెంగళూరు (bengaluru) ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ అనుచేత్ మీడియాకు చెప్పారు.
బెంగళూరు బంద్ (bengaluru bandh) సందర్బంగా బందో బస్తులో ఉన్న పోలీసులకు ఆహారం సరఫరా చేశారు. ఒకరోజు ఒక్కొక్కరికి భోజనానికి ప్రభుత్వం 200 రూపాయలు చెల్లిస్తుంది. అయితే నాణ్యమైన భోజనం ఎందుకు అందించడం లేదని పోలీసు అధికారులు హోటల్ యజమాన్యన్ని ప్రశ్నించారు.
బెంగళూరులోని (bengaluru)అశోక్ టిఫిన్ సెంటర్ నుంచి పోలీసులకు అల్పాహారం సరఫరా చేశారని అధికారులు గుర్తించారు. అశోక్ టిఫిన్ సెంటర్ నుంచి మొత్తం 180 మంది పోలీసులకు భోజనం పెట్టినట్లు సమాచారం. చచ్చిపోయిన ఎలుక (rat)ఉన్న ఆహారాన్ని (food) తయారు చేసి గుడ్డిగా బందోబస్తులో (bengaluru bandh)ఉన్న పోలీసులకు వడ్డించడంపై పోలీసు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అలాంటి వారు తయారు చేసిన భోజనం (food)తింటే ఎవరికి సమస్యలు వస్తాయని కొందరు పోలీసులు అంటున్నారు. అయితే చచ్చిపోయిన ఎలుక (rat) ఉన్న ఆహారం పోలీసులు తినలేదని, ఈ విషయంపై లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ విభాగం పోలీసులు వేర్వేరుగా విచారణ చేస్తున్నారని బెంగళూరు (bengaluru bandh) ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ అనుచేత్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications