మూగ, చెవుడు, ప్రియురాలితో ఎంజాయ్: ఎంత కిరాతకంగా చంపాడు, ఎముకలు, పుర్రె!
బెంగళూరు: ప్రియుడు మూగ, చెవిటివాడు. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసిన ప్రియురాలిని ఎంత దారుణంగా చంపాడంటే చివరికి శవం కూడా చిక్కకుండా ఎముకలు మాత్రమే మిగిలేటట్లు హత్య చేసి ఏమీ తెలీని అమాయకుడి లాగా నటించాడు. పోలీసులు బెండ్ తియ్యడంతో అసలు విషయం అంగీకరించిన ఘటన కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గౌరిబిదనూరు సమీపంలో జరిగింది.

గార్మెంట్స్ ఉద్యోగులు
గౌరిబిదనూరులోని మునేశ్వరలేఔట్ లో నివాసం ఉంటున్న కిశోర్ మూగ, చెవిటివాడు. గౌరిబిదనూరు శివార్లలోని రేమైండ్స్ గార్మెంట్స్ లో కిశోర్ సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కోడిగానహళ్ళిలో నివాసం ఉంటున్న 20 ఏళ్ల యువతి అదే గార్మెంట్స్ లో ఉద్యోగం చేస్తున్నది.

ప్రేమ ముసుగులో ఎంజాయ్
కిశోర్, యువతికి పరిచయం అయ్యింది. ఒకేచోట ఉద్యోగం చేస్తున్న ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కిశోర్ కొన్ని నెలలుగా యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటాడు కదా అని కిశోర్ ఎప్పుడు అడిగినా యువతి శారీకర సుఖం ఇచ్చింది.

నీ కులం నా కులం వేరు
కిశోర్ ప్రవర్తన మీద అనుమానం రావడంతో యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ప్రియురాలు ఒత్తిడి ఎక్కువ కావడంతో కిశోర్ తిరగబడ్డాడు. నీ కులం వేరు, నా కులం వేరు, పెద్దలు అంగీకరించరని కిశోర్ రివర్స్ అయ్యాడు. అయితే తనకు అడిగినంద డబ్బు ఇవ్వాలని యువతి డిమాండ్ చేసిందని తెలిసింది.

డబ్బులు ఇస్తాను
డబ్బులు ఇవ్వాలని యువతి ఎక్కవ ఒత్తిడి చెయ్యడంతో ఎలాగైనా ఆమెను చంపేయాలని కిశోర్ ప్లాన్ వేశాడు. మార్చి 4వ తేదీ డబ్బులు ఇస్తానని ప్రియురాలిని నమ్మించిన కిశోర్ అతని బైక్ మీద గౌరిబిదనూరు తాలుకాలోని దోడ్డహనుమేనహళ్ళి సమీపంలోని నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లాడు.

కిరాతకంగా చంపాడు
నిర్జనప్రదేశంలో ప్రియురాలిని ఒక గుంతలోతోసి ఆమె తల మీద బండారాళ్లు వేశాడు. అనంతరం ప్రియురాలి చున్నీతోనే ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ప్రియురాలు మొబైల్, బ్యాగ్ గుంతలో వేసిన కిశోర్ అక్కడి నుంచి చాకచక్యంగా వెళ్లిపోయాడు.

యువతి ఫ్యామిలీ
మార్చి 4వ తేదీ ఇంటి నుంచి వెళ్లి యువతి ఎన్నిరోజులుకు తిరిగిరాకపోవడంతో మార్చి 10వ తేదీన ఆమె కుటుంబ సభ్యులు మంచేనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 30వ తేదీన దోడ్డహనుమేనహళ్ళి సమీపంలోని నిర్జనప్రదేశంలో తల పుర్రె, ఎముకలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మొబైల్ లో సెల్ఫీలు
తల పుర్రె, ఎముకలు స్వాధీనం చేసుకున్న పోలీసులు అదే ప్రాంతంలో యువతి బ్యాగ్ గుర్తించారు. బ్యాగ్ లో స్విచ్ ఆఫ్ అయిన మొబైల్ కు రీచార్జ్ చేసిన పోలీసులు అందులో యువతి, కిశోర్ తీసుకున్న సెల్ఫీలు గుర్తించారు. పోలీసులు కిశోర్ ను అదపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో అసలు విషయం అంగీకరించాడు. మూగ, చెవిటివాడు అయిన కిశోర్ ప్రియురాలిని ఎంత దారుణంగా హత్య చేశాడో తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు.












Click it and Unblock the Notifications