పళనిపామి ప్రభుత్వం పతనం ? పన్నీర్ సెల్వం చెప్పిన మరుసటి రోజే ఇలా !
శేఖర్ రెడ్డి ఇంటిలో బయటపడిన డైరీలో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా, కమీషన్ల వివరాలు ఉండటంతో ఎడప్పాడి పళనిసామి తలపట్టుకున్నారు. ఐటీ శాఖ అధికారులు ఏసీబీని రంగంలోకి దించే రీతిలో సూచనలు ఇవ్వడంతో పళనిస
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం సంకటంలో పడే అవకాశాలు స్పష్టంగా కలిపిస్తున్నాయి. ఆదాయపన్ను శాఖ రూపంలో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు మరన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంటిలో లభించిన డైరీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కొందరు సీనియర్ అధికారుల జాతకాలు మొత్తం ఉన్నాయని వెలుగు చూసింది. శేఖర్ రెడ్డి వ్యవహారం మంత్రులు, ఎమ్మెల్యేలు, కొందరు అధికారుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటూ ఐటీ శాఖ అధికారులు సీఎం పళనిసామికి లేఖ రాయడం పెద్ద చర్చకు దారితీసింది.

జయలలిత మరణం
జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ పార్టీ కార్యకర్తలు విసిగిపోతున్నారు. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళ, టీటీవీ దినకరన్ తో పాటు మన్నార్ గుడి మాఫియా చేతిలోకి వెళ్లాయి.

సీఎంకు సినిమా చూపించారు
ఐటీశాఖ అధికారులు అదును చూసి తమిళనాడులో దాడులు చేశారు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఐటీ శాఖ దాడులు హోరెత్తాయి. ఆర్ కే నగర్ ఉప ఎన్నిలక సందర్బంగా ఆదాయపన్ను శాఖ అధికారులు ఏకంగా ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి సినిమా చూపించారు.

శేఖర్ రెడ్డి ఇంట్లో డైరీ
పెద్దనోట్లు రద్దు తరువాత ఐటీ శాఖ అధికారులు చెన్నైలోని టీ నగర్ లో కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంట్లో దాడులు చేసి భారీ మొత్తంలో నగదు, కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో శేఖర్ రెడ్డి గదిలో అధికారులు ఓ డైరీ స్వాధీనం చేసుకున్నారు.

డైరీలో మంత్రుల జాతకాలు
కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి తమిళనాడు మంత్రులు, ఎమ్మెల్యేల జాతకాలు మొత్తం తన దగ్గర పెట్టుకున్నారని వెలుగుచూసింది. ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకునే సమయంలో తనకు సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఎంత మొత్తంలో కమీషన్ (లంచం) ఇచ్చిన పూర్తి వివరాలు ఆ డైరీలో రాసిపెట్టారని ఆదాయపన్ను శాఖ అధికారులు అంటున్నారు.

సీఎంకు లేఖ రాసిన ఐటీ శాఖ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఆదాయపన్ను శాఖ అధికారులు లేఖ రాశారు. ఆ సమయంలో తాను సీఎంగా లేనప్పటికీ తాజాగా అప్పటి భారాన్ని తాను మోయాల్సిన పరిస్థితి పళనిసామికి తప్పడం లేదు. శేఖర్ రెడ్డి డైరీలో ఉన్న కమీషన్ల చిట్టా (లంచం) వివరిస్తూ సీఎం పళనిసామి ఐటీ శాఖ లేఖ సంధించడం పెద్ద చర్చకు దారితీసింది.

పన్నీర్ సెల్వం చెప్పిన మరుసటిరోజే
పన్నీర్ సెల్వం కాంచీపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ త్వరలో తమిళనాడులో శాసన సభ ఎన్నికలు జరుగుతాయని, కార్యకర్తలు అందరూ సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆ మరసటి రోజే ఐటీ శాఖ అధికారులు ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని గురి పెట్టి లేఖ రాయడం పెద్ద చర్చకు దారితీసింది.

తల పట్టుకున్న పళనిసామి
శేఖర్ రెడ్డి ఇంటిలో బయటపడిన డైరీలో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా, కమీషన్ల వివరాలు ఉండటంతో ఎడప్పాడి పళనిసామి తలపట్టుకున్నారు. ఐటీ శాఖ అధికారులు ఏసీబీని రంగంలోకి దించే రీతిలో సూచనలు ఇవ్వడంతో పళనిసామి ప్రభుత్వం ఆందోళనకు గురైయ్యింది.
-
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..! -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్












Click it and Unblock the Notifications