దీపావళికి స్పెషల్ వందే భారత్- ఈ రద్దీ రూట్‌లో..

చెన్నై: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 33 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.

ఈ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరతగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

A Diwali special train to Chennai-bengaluru-ernakulam route will launch soon

ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ- మరింత వినూత్నంగా తీర్చిదిద్దబోతోంది. ఇందులో భాగంగా కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానుంది. 2024 ఫిబ్రవరి నాటికి ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి.

ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని వందే భారత్ రైలు సర్వీసులను పొడిగించడానికి ప్రాధాన్యత ఇస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగా కొన్ని రైలు సర్వీసులను ఎంపిక చేసింది. వాటిని దశలవారీగా అమలులోకి తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను రూపొందించింది.

ఇక దీపావళి పండగ సీజన్‌లో ఏర్పడే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో- స్పెషల్ వందే భారత్ రైళ్లను కూడా పట్టాలెక్కిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. పలు రద్దీ మార్గాల్లో వాటిని అందుబాటులోకి తీసుకుని రానుంది. ఇప్పటికే పాట్నా- న్యూఢిల్లీ మధ్య ప్రత్యేక వందే భారత్ రైలు పరుగులు పెట్టింది.

ఇక తాజాగా.. చెన్నై-బెంగళూరు- ఎర్నాకుళం మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించనుంది. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ స్పెషల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. శుక్రవారం తెల్లవారు జామున బెంగళూరులోని క్రాంతివీర సంగోళి రాయన్న స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు అదే రోజు మధ్యాహ్నం 1:30కు ఎర్నాకుళం చేరుకుంటుంది.

కాట్పాడి, జోలార్‌పేట్టై, కోయంబత్తూరు, పాలక్కాడ్ జంక్షన్‌లల్లో దీనికి హాల్ట్ సౌకర్యం కల్పించారు. మళ్లీ రాత్రి 11:30 గంటలకు ఎర్నాకుళం నుంచి బయలుదేరి మరుసటి తెల్లవారు జామున 4:30 గంటలకు చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. దీపావళి పండగ సీజన్ ముగిసేంత వరకూ ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+