Tea: చాయ్ ఇవ్వలేదని ఆపరేషన్లను మధ్యలోనే వదిలేసిన డాక్టర్..

చాయ్(Tea) ఇవ్వలేదని చెప్పి ఓ వైద్యుడు(Doctor) ఆపరేషన్లను మధ్యలోనే వదిలిసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కప్పు టీ విషయంలో వివాదం తలెత్తడంతో ఒక వైద్యుడు అకస్మాత్తుగా శస్త్రచికిత్సలను మధ్యలోనే వదిలేశాడు. నవంబర్ 3న మౌడ తహసీల్‌లోని స్థానిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన జరిగింది. నవంబర్ 3న ఎనిమిది మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలని నిర్ణయించారు.

ఇందుకు సంబంధించి బాధ్యతను డాక్టర్ తేజరంగ్ భలవికి అప్పగించారు. నలుగురికి విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించి, మిగిలిన రోగులకు అనస్థీషియా అందించిన తర్వాత డాక్టర్ భాలవి ఆసుపత్రి సిబ్బంది కప్పు టీ అడిగారు. అయితే సిబ్బంది ఆమె అభ్యర్థను పట్టించుకోలేదు. దీంతో భాలవి ఆశ్చర్యకరంగా ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వెళ్లిపోయారు. మిగిలిన నలుగురు మహిళల ఆపరేషన్లు నిలిచిపోయాయి.

A doctor in Maharashtra left the operation mid-way because he was not given tea

డాక్టర్ అకస్మాత్తుగా నిష్క్రమించడంతో ఆసుపత్రి పరిపాలన జిల్లా వైద్యాధికారిని సంప్రదించారు. ఆయన మత్తుమందు ఇచ్చిన రోగులకు శస్త్రచికిత్సలను పూర్తి చేయడానికి మరొక వైద్యుడిని పంపారు. ఈ ఘటనపై నాగ్‌పూర్‌ జిల్లా పరిషత్‌ సీఈవో సౌమ్యశర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.

కమిటీ నివేదిక ఆధారంగా డాక్టర్ భలవిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. "టీ తీసుకోనందుకు డాక్టర్ భాలవి ఆపరేషన్ నుంచి నిష్క్రమించినట్లు నాకు సమాచారం అందింది. ఈ ఘటన అత్యంత తీవ్రమైన విషయం. వైద్యులు కేవలం ఒక కప్పు టీతో ఇటువంటి క్లిష్టమైన విధానాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటే, వారు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 304 ప్రకారం బాధ్యత వహించాలి" అని శర్మ వివరించారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం వెంటనే విచారణకు ఆదేశించింది. త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+