పోస్టర్‌పై ఐస్‌క్రీమ్‌ను నిజమని నమ్మిన కుక్క చేసినపని వీడియో వైరల్; కుక్కపై నెటిజన్ల జాలి!!
ఇంటర్నెట్లో ఈ మధ్యకాలంలో అనేక వీడియోలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. మరి కొన్ని వీడియోలు సరదాగా అనిపిస్తే, ఇంకొన్ని వీడియోలు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. ఇంకొన్ని అయ్యో పాపం అనే భావనను కలిగిస్తున్నాయి. మనలో ఉండే ఆలోచనా శక్తికి మరింత పదును పెట్టే ప్రయత్నం చేస్తున్న వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న కుక్కల వీడియోలు
తాజాగా జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంటర్నెట్ ఫన్నీ జంతువుల కంటెంట్‌తో నిండిపోతుంది. ఇక అన్నిటికంటే ఇంటర్నెట్లో కుక్కలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. కుక్కలు అత్యంత విశ్వసనీయమైన జంతువులలో ఒకటిగా భావిస్తారు. ఇక వాటి ఆశ్చర్యపరిచే చేష్టలు చూడటానికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు బాధను కూడా కలిగించవచ్చు.
ఐస్ క్రీమ్ కోసం పోస్టర్ నాకుతున్న కుక్క.. ఎంతకీ రాకపోవటంతో కాలితో తంతూ అసహనం
ఇక అటువంటి బాధను కలిగించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ వీడియోలో, ఒక కుక్క ఐస్ క్రీం పోస్టర్‌ను నాకుతూ బిజీగా కనిపించింది. కుక్క ఆ ఐస్ క్రీమ్ నిజమైన ఐస్ క్రీమ్ అని భావించి పోస్టర్ను పదేపదే నాకుతోంది. ఇక కుక్క నాకుతున్న ఐస్ క్రీమ్ పోస్టర్లో పోస్టర్‌లో 3 రకాల ఐస్‌క్రీమ్‌లు కనిపిస్తాయి మరియు ఆకలితో ఉన్న కుక్క ఐస్‌క్రీమ్ ను గట్టిగా కొరుకుతుంది. దానిని తినడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఐస్ క్రీమ్ నోటిలోకి రాకపోవడంతో అ నిరాశ చెందిన కుక్క ఆ రేకుతో చేసిన పోస్టర్ బోర్డును పదే పదే కాలితో కొడుతుంది, కానీ పాపం కుక్కకు మాత్రం దాని ఆశ తీరలేదు.

సోషల్ మీడియాలో వైరల్ వీడియో.. కుక్కపై జాలి చూపిస్తున్న నెటిజన్లు
ఒ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆలోచించేలా చేసింది. ఐస్ క్రీమ్ కోసం ఆ కుక్క చేస్తున్న ప్రయత్నం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. పాపం పూర్ డాగ్ అంటూ కుక్క ఐస్ క్రీం కోసం చేస్తున్న పోరాటం పై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఐస్ క్రీమ్ తినాలనిపించినా తినలేని కుక్క పరిస్థితికి జాలి పడుతున్నారు. ఆ కుక్క అది ఐస్ క్రీం అని గుర్తించగలిగేంత తెలివైనది, అది కాదని తేలినప్పుడు వదులుకునేంత తెలివైనది కాదు అంటూ ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోను5.2 మిలియన్ల మంది చూశారు. మరియు 22,000 కంటే ఎక్కువ రీట్వీట్లు ఉన్నాయి అంటే ఎంతగా ఈ వీడియో వైరల్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications