Wife: టీచర్ అని చెప్పి పెళ్లి, ఉదయం నుంచి పీఓట్, క్వాటర్లు చాలవు మిత్రమా, అంతే !
టీచర్ అని యువతి కుటుంబ సభ్యులకు అపద్దం చెప్పిన యువకుడు వివాహం చేసుకున్న తరువాత అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. తరువాత భర్త అతని శాడిజం చూపించడం మొదలుపెట్టాడు.
చెన్నై/తిరువణ్ణామలై: టీచర్ అని యువతి కుటుంబ సభ్యులకు అపద్దం చెప్పిన యువకుడు వివాహం చేసుకున్న తరువాత అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. తరువాత భర్త అతని శాడిజం చూపించడం మొదలుపెట్టాడు. భర్త టార్చర్ తట్టుకోలేక, పుట్టింటికి వెళ్లి అసలు మ్యాటర్ చెప్పలేక భార్య నరకం అనుభవించింది. పనిలో పనిగా భార్యను చంపేసిన భర్త ఆమె శవాన్ని ఫ్యాన్ కు వేలాడదీశాడు. మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చేశాయి.

టీచర్ అని నమ్మించాడు
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని వెట్టవలం పక్కనే ఉన్న ఓలైపాడి గ్రామంలో నరేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తాను టీచర్‌గా పనిచేస్తున్నానని జయభారతి అనే యువతి కుటుంబ సభ్యులకు నరేష్ అబద్ధం చెప్పాడు. 2017లో పెరియవలసాయి గ్రామానికి చెందిన జయభారతిని నరేష్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో జయభారతి కుటుంబ సభ్యులు 16 తులాల బంగారు నగలు, నగదుతో పాటు బైక్ ను నరేష్ కు కట్నం కింద ఇచ్చారు.

నెల రోజులకే నరకం చూపించాడు
వివాహం జరిగిన నెల రోజులకే నరేష్ అతని భార్యకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. 5 సంవత్సరాలుగా నరేష్ ఏ పనికి వెళ్లకుండా తాగిన మత్తులో ఇంటికి వెళ్లి అతని భార్య జయభారతిని కొట్టి అదనపుకట్నం అడుగుతూ వేధిస్తున్నాడు. గురువారం రాత్రి నరేష్ అతని తల్లి, సోదరితో కలిసి జయభారతిపై దారుణంగా దాడి చంపేశారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం జయభారతి శవాన్ని ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడదీసి పరారయ్యారు. జయభారతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని నరేష్ అతని భార్య జయభారతి తమ్ముడు దక్షిణామూర్తికి ఫోన్ చేసి సమాచారం అందించాడు.

ముఖం, దవడ వాచిపోయింది
జయభారతి మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్స్‌లో తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. జయభారతి తల్లిదండ్రులు, తమ్ముడు, బంధువులు తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి వెళ్లి జయభారతి మృతదేహాన్ని చూశారు. జయభారతి ముఖం, దవడ, నోటిపై తీవ్రగాయాలు, దవడ వాచి ఉండడంతో ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.

భర్త, అతని ఫ్యామిలీ చంపేశారు
అనంతరం వేటవలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ వేట్టవలం పోలీస్ స్టేషన్‌లో హత్య కేసుగా నమోదు కాలేదని బాధితులు చెబుతున్నారు. నరేష్, అతని అక్క, అతని తల్లి ఇంత దూరం వచ్చి జయభారతి మృతదేహాన్ని ఆసుపత్రిలో వదిలేసి ఆమె ముఖం కూడా చూడకుండా పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాని అంటున్నారు. జయభారతిని హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు నరేష్ కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టారు.

హత్య కేసును ఆత్మహత్య కేసు చేసిన పోలీసులు ?
పోలీసులు మాత్రం హత్య కేసు నమోదు చెయ్యకుండా ఆత్మహత్య అని కేసు నమోదు చేశారు, జయభారతి కుటుంబ సభ్యులు, బంధువులు 50 మందికి ఆసుపత్రి ముందు ధర్నా చేసి నరేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. తిరువణ్ణామలై రెవెన్యూ శాఖ కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వరకట్నం కోసం కూతురిని హత్య చేసిన హంతకులను అరెస్టు చేసే వరకు తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి మార్చురీలో ఉంచిన జయభారతి మృతదేహాన్ని తీసుకోమని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

సార్ కు రెండో పెళ్లి
గత నెలలో వరకట్నం అడిగినందుకు జయభారతిని తరచూ కొట్టేవాడని బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు తిరువణ్ణామలై మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నరేష్‌ను పిలిపించి అతనికి వార్నింగ్ ఇచ్చి మరోసారి జయభారతిని కట్నం అడిగి వేధించవద్దని సూచించారని వెలుగు చూసింది. గతంలో నరేష్ కు వివాహం అయ్యిందని, అతని టార్చర్ తట్టుకోలేక అతని మొదటిత భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని తరువాత తాను టీచర్ అని అపద్దం చెప్పి జయభారతిని రెండో పెళ్లి చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications