లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న కూతురి గొంతు కోసి చంపిన తండ్రి, ప్రియుడు !

బెంగళూరు/బళ్లారి: వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమిస్తున్న కూతురిని కన్నతండ్రి హత్య చేశాడు. తన ప్రియురాలు ఆమె తండ్రి చేతిలో హత్యకు గురైయ్యిందని తెలుసుకున్న ప్రియుడు తల్లడిల్లిపోయాడు. ప్రియురాలు లేని జీవితం మనకు వద్దు అకున్న ప్రియుడు రైలులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు

కర్ణాటకలోని కోలారు జిల్లాలోని బంగారుపేట సమీపంలోని కామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తాలూకాలోని బోడగుర్కి గ్రామానికి చెందిన కీర్తీ (20) అనే యువతిని ఆమె తండ్రి కృష్ణమూర్తి గొంతుకోసి హత్య చేశాడు. ఈ విషయం తెలిసి అదే గ్రామానికి చెందిన కీర్తి ప్రియుడు గంగాధర్ అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

 deadbody3

గంగాధర్, కీర్తి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి తండ్రి రగిలిపోయాడు. నా కూతురు కీర్తి జోలికి వస్తే నిన్ను చంపేస్తానని ఇప్పటికే చాలా సార్లు ప్రియుడు గంగాధర్ కు వార్నింగ్ ఇచ్చాడు. అయితే గంగాధర్, కీర్తి మాత్రం వారి ప్రేమను వదలుకోకూడదని డిసైడ్ అయ్యారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని కీర్తి డిసైడ్ అయ్యింది.

తండ్రి గురించి ఏమాత్రం పట్టించుకోని కీర్తి ఇంటి నుంచి పారిపోయి గంగాధర్ ను పెళ్లి చేసుకోవడాని సిద్దం అయ్యారు. దీంతో తండ్రీకూతుళ్ల మధ్య జరిగిన మాటల వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఇదే సమయంలో సహనం కోల్పోయిన తండ్రి అతని కూతురు కీర్తి గొంతు కోసి చంపేశాడు. ఎంత చెప్పినా వినలేదని ఇంట్లోనే కూతురు కీర్తి గొంతుకోసి హత్య చేసి ఆ మ్యాటర్ కుటుంబ సభ్యుకు చెప్పాడు. కీర్తి హత్యకు గురైయ్యిందని తెలుసుకున్న గంగాధర్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామసముద్రం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+