కొడుకును హత్య చెయ్యడానికి అతని ఫ్రెండ్స్ కు కిరాయి ఇచ్చిన తండ్రి, ఆమ్యాటర్ !
బెంగళూరు/బెళగావి: ఇంట్లోని విలువైన వస్తువులు, పండించిన ధాన్యాన్ని అమ్ముతూ ఎంజాయ్ చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకున్న మహిళలకు తగలేస్తూ వేధిస్తున్న కొడుకును హత్య చేసేందుకు తండ్రి సుపారీ ఇచ్చాడు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని బైలహోంగళ పట్టణంలోని శివానంద భారతి నగర్‌కు చెందిన సంగమేష్ మారుతి తిగాడి (39) హత్యకు గురయ్యాడు.
సవదత్తి తాలూకా హిరేకొప్ప గ్రామానికి చెందిన మంజునాథ్, హీరేకొప్ప గ్రామానికి చెందిన అంజప్ప అనే నిందితులను అరెస్టు చేశారు. హత్యకు గురైన సంగమేష్ మద్యానికి బానిసైనాడు. రోజూ ఉదయం నుంచి అర్దరాత్రి వరకు మద్యం సేవించి తండ్రి, తల్లిని వేధించేవాడు. అలాగే తాగుడుకు బానిసై ఇంట్లోని విలువైన వస్తువులు, దాన్యం గింజలు అమ్ముతూ మద్యం తాగేవాడు. వీటికి తోడు సంగమేష్ కు కొంత మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసింది.

గోకాక తాలూకాలోని అంకల్గికి మంజునాథ్ హొంగాల ద్విచక్రవాహనంపై అతనితో పాటు వచ్చాడు. ఆ తర్వాత హీరేకొప్ప గ్రామానికి తిరిగి అంజప్పను తీసుకుని అంకాలగికి తిరిగి వెళ్లాడు. అంజప్ప సహకారంతో అక్కడి వైన్‌షాప్‌లో మద్యం సేవించి మత్తులో ఉన్న సంఘమేష్ ను నిందితుడు మంజునాథ్ అతని బైక్‌పై సవదత్తి తాలూకా కుటరానట్టి గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. తరువాత నిర్మానుష్య ప్రాంతంలో సంఘమేష్ తల మీద బండరాళ్లతో దాడి చేసి అతన్ని హత్య చేసి పరారయ్యారు.

గోకాక్ తాలూకాలోని అంకాలగిలో ముగ్గురు మద్యం తాగి కుతరనట్టిగ్రామ్‌లోని నిర్జన ప్రాంతంలో సంగమేష్ తలపై రాయి విసిరి తప్పించుకున్నారు. సమాచారం తెలుసుకున్న మురగోడ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. తరువాత హత్యకు గురైయ్యింది సంఘమేష్ అని వెలుగు చూసింది. హత్య జరిగిన ప్రాంతంలో చిక్కన ఓ ఫోనెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.
ఈ నంబర్‌కు ఫోన్ చేసిన పోలీసులు హంతకులు మంజునాథ్, అంజప్పను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం మేరకు హత్యకు గురైన సంగమేష్ ఇంటికి వెళ్లి విచారించగా అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. హత్య జరిగిన 24 గంటల్లోనే హత్య కేసును ఛేదించడంలో విజయం సాధించారు. ఈ మేరకు మురగోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సంఘమేష్ ను హత్య చెయ్యడానికి అతని తండ్రి రెండు లక్షల రుపాయలు ఇస్తానని మంజునాథ్ తో డీల్ మాట్లాడుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications