పెళ్లికొడును 15 సార్లు కసిగా పొడిచి చంపిన తండ్రి, రూ 65 లక్షల నగలు, నగదు ?, జిమ్ ఓనర్ స్టోరీతో షాక్ !
కొడుక్కి పెళ్లి చేసి కోడలిని ఇంటికి పిలుచుకుని వస్తాడు అనుకున్న తండ్రి రివర్స్ లో పెళ్లి చేసుకోవలసిన కన్న కొడుకును కత్తితో 15 సార్లు పొడిచి దారుణంగా చంపిన షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పెళ్లికి సిద్ధమవుతున్న యువకుడు పెళ్లికి ఒక్కరోజు ముందే కన్నతండ్రి చేతిలో దారుణ హత్యకు గురైనాడని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.
ఢిల్లీలో (న్యూఢిల్లీ) నివాసం ఉంటున్న గౌరవ్ సింఘాల్ అనే యువకుడు దారుణ హత్యకు గురైనాడని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో గౌరవ్ సింఘాల్ సొంతంగా జిమ్ సెంటర్ నడుపుతున్నాడు. గౌరవ్ కు పెళ్లి ఫిక్స్ అయ్యింది. అయితే ఢిల్లీలోని డియోలీ ప్రాంతంలో తండ్రి రంగ్ లాల్ అనే వ్యక్తి అతని కొడుకు గౌరవ్ ను దారుణంగా చంపాడు. ఈ సంఘటన తర్వాత తండ్రి రంగ్ లాల్ చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు.

కొడుకును హత్య చేసి తప్పించుకుని పారిపోయిన రంగ్ లాల్ ను శుక్రవారం ఉదయం జైపూర్‌లో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 7వ తేదీ అర్ధరాత్రి 12:30 గంటలకు డియోలీ ఎక్స్‌టెన్షన్‌లోని రాజు పార్క్ దగ్గర యువకుడి హత్య చేశారని సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే తిగ్రీ పోలీస్ స్టేషన్ సిబ్బంది, పీసీఆర్ వ్యాన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆ సమయంలో గౌరవ్ సింఘాల్ అనే 29 ఏళ్ల యువకుడిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులకు తెలిసింది. అప్పటికే కుటుంబ సభ్యులు గౌరవ్ ను మాక్స్ ఆస్పత్రికి తరలించారు. గౌరవ్ ను ఆసుపత్రికి తరలించారని తెలుసుకున్న పోలీసు బృందం తరువాత ఆసుపత్రికి చేరుకున్నారు, పోలీసులు ఆసుపత్రికి చేరుకునేలోపే గౌరవ్ చనిపోయాడు. అనంతరం పోలీసులు గౌరవ్ హత్య జరిగిన ఆ స్థలాన్ని పరిశీలించగా ఎక్కడికక్కడే రక్తపు మరకలు కనిపించాయి.
గౌరవ్ ను కత్తులతో పొడిచి అతని మృతదేహాన్ని ఈడ్చుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. గౌరవ్ ను హత్య చేసిన తరువాత అతని మృతదేహాన్ని తక్షణమే కుటుంబ సభ్యులకు అప్పగించాలని హంతకుడు భావించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఇటీవలే గౌరవ్ సింఘాల్ నిశ్చితార్థం జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు పక్క ఇంట్లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేడుకల్లో గౌరవ్ కుటుంబ సభ్యులు నృత్యం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ముగ్గురు సహచరులతో కలిసి తండ్రి రంగ్ లాల్ ఇంట్లో ఉన్న అతని కొడుకు గౌరవ్‌ను ఇంట్లోనే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఢిల్లీ దక్షిణ జిల్లా డీసీపీ ఏమన్నారంటే?
గౌరవ్ ను హత్యా చేసిన అనంతరం గౌరవ్ తండ్రి రంగ్ లాల్ ఇంటి నుంచి పారిపోయాడు కొడుకు గౌరవ్ ను హత్య చేసిన తరువాత రంగ్ లాల్ రూ. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ 15 లక్షల నగదు ఎత్తుకుని ఇంటి నుంచి పారిపోయాడని ఢిల్లీ దక్షిణ జిల్లా డీసీపీ అంకిత్ చౌహాన్ మీడియాకు తెలిపారు. పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏదో విషయమై కొడుకు గౌరవ్‌తో అతని తండ్రి రంగ్ లాల్ గొడవ పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంతలో సహనం కోల్పోయిన గౌరవ్ అతని తండ్రి రంగ్ లాల్‌ను చెప్పుతో కొట్టాడు, ఆ తర్వాత రంగ్ లాల్ అతని ముగ్గురు సహచరులతో కలిసి గౌరవ్‌ను హత్య చేసి ఇంట్లో ఉన్న నగదు, నగలు లూటీ చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. గౌరవ్ సింఘాల్ తన కుటుంబం చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావించాడని, కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గి పెళ్లికి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
ఈ విషయమై తండ్రీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరిగేవని బంధువులు చెబుతున్నారని డీసీపీ అంకిత్ చౌహాన్ తెలిపారు. కొడుకు గౌవర్ ను దారుణంగా హత్య చేసిన రంగ్ లాల్ మైగ్రేన్ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇప్పటికీ అతను చాలా మందులు వాడుతున్నాడని సమాచారం అందిందని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద పెళ్లికి ఒక్కరోజు ముందు పెళ్లికొడుకు గౌరవ్ అతని తండ్రి చేతిలోనే హత్యకు గురికావడం దేశరాజధాని ఢిల్లీలో కలకలం రేపింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications