నీ భార్యతో ఎంజాయ్ చెయ్యాలని ఉంది, ఫ్రెండ్స్ పార్టీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భర్తకు ఆఫర్ !
బెంగళూరులోని బాగలూరు క్రాస్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతదేహం లభ్యమైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విచారణకు వెళ్లిన బెంగళూరు పోలీసులు హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి స్నేహితుడిని పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో కలకలం రేపే వివరాలు వెలుగులోకి వచ్చాయి
బెంగళూరు నగరంలోని బాగలూరు క్రాస్ వద్ద కారులో రియల్ వ్యాపారి కృష్ణప్రసాద్ మృతదేహం లభ్యమైంది. యలహంక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తరువాత పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణప్రసాద్ హత్యకు గురైనాడని నిర్దారించుకున్నారు. సంఘటనా స్థలంలో పరిశీలించిన పోలీసులు పలు ఆదారాలు సేకరించారు. తరువాత పోలీసులు కృష్ణప్రసాద్ హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడని, చాలా సంవత్సరాల నుంచి బెంగళూరులోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులను పోలీసులు సంప్రధించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణప్రసాద్ మొబైల్ ఫోన్ లోని కొన్ని నెంబర్లను పోలీసులు పరిశీలించారు. హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణప్రసాద్ కు ఆరోజు వచ్చిన ఇన్ కమింగ్ ఫోన్లు, ఔట్ గోయింగ్ ఫోన్ కాల్స్ వివరాలను పోలీసులు సేకరించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సంతోష్ కుమార్‌ను బెంగళూరులోని యలహంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణప్రసాద్ గతంలో బట్టల వ్యాపారం చేస్తున్న స్నేహితుడు సంతోష్‌కు చాలాసార్లు డబ్బు సాయం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణప్రసాద్, బట్టల వ్యాపారి సంతోష్ ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది
సోమవారం రాత్రి కృష్ణప్రసాద్, సంతోష్ కలిసి కారులో బాగలూరు క్రాస్ వైపు వెళ్లారు. ఆ తర్వాత మరో స్నేహితుడు కూడా వీరిద్దరితో కలిశాడు. ముగ్గురూ కలిసి లిక్కర్ పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో ఫుల్ గా మద్యం సేవించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణప్రసాద్ అతని స్నేహితుడు సంతోష్ భార్య, కొడుకు గురించి అనరాని మాటలు మాట్లాడినట్ల సమాచారం. నీ బట్టల వ్యాపారానికి కావలసిన డబ్బులు నేను ఇస్తానని, నాకు మూడ్ వచ్చినప్పుడు అంతా నువ్వు నీ భార్యను నాతో పంపించాలని రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణప్రసాద్ అతని ఫ్రెండ్ సంతోష్ కు చెప్పాడని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతుడు కృష్ణప్రసాద్ గత కొన్నేళ్లుగా బెంగళూరులో నివాసం ఉంటున్నాడని, అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని డీసీపీ తెలిపారు. ప్రస్తుతం మృతుడు కృష్ణ ప్రసాద్ హత్యకు అసలు కారణం ఏమిటనే కోణంలో విచారణ కొనసాగుతోంది. సంతోష్ భార్యతో రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణప్రసాద్ అక్రమ సంబందం పెట్టుకున్నాడా ? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది












Click it and Unblock the Notifications