Friends: అధికారంలో ఉంటే అన్నీ ఓకే, ప్రతిపక్షంలో ఉంటేనే లేనిపోని రామాయణాలు, తెలుసా ?

చెన్నై/మదురై/కరూర్: ఇద్దరు స్నేహితులు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు నెలకు ఒకసారి లావాదేవీల వ్యవహారాలు చూసుకుంటున్నారు. వడ్డీ వ్యాపారులు మద్దతు ఉన్న పార్టీ అధికారంలో ఉన్నంత వరకు వీరి వ్యాపారం చాలా సాఫీగా సాగిపోయింది. తరువాత అసలు కథ మొదలైయ్యింది.

తమిళనాడులోని కరూర్ జిల్లా అయ్యంబాలయం గ్రామానికి చెందిన ఫైనాన్షియర్ అన్బు నాథన్, నామక్కల్ జిల్లా పరమతి వెల్లూరుకు చెందిన ప్రకాష్ గత కొన్నేళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. అన్బునాథన్ అన్నాడీఎంకే పార్టీలో ఆ జిల్లాలో పవర్ ఫుల్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడులో 10 సంవత్సరాలు వరుసగా అధికారంలో ఉన్న సమయంలో అన్బునాథన్ భారీ మొత్తంలో డబ్బులు సంపాధించాడని సమాచారం..

A friend who filed a case against the leader of the opposition, how long has it been business?

అన్బుమణి బిజినెస్ పార్టనర్ ప్రకాష్. ప్రకాష్ 2018లో అన్బునాథన్‌కి కోటి రూపాయలు చెల్లించినట్లు సమాచారం. పైప్ కంపెనీ నడుపుతున్న ఏఐఏడీఎంకే నేత అన్బు నాథన్ 2020లో తన కంపెనీలో భాగస్వామిగా చేరతానని చెప్పి మళ్లీ ప్రకాష్ నుంచి రూ.2 కోట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. తరువాత ఇద్దరి మధ్య కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని తెలిసింది.

తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. డబ్బు అందిన తరువాత అన్బునాథన్ 15 రోజుల క్రితం ప్రకాష్ ఇంటికి వెళ్లి తన కంపెనీలో భాగస్వామిగా ఉండాలని, లేదంలే నీ కథ చూస్తానని వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది. కంపెనీలో చేరను అని, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో తాను కొన్న డబ్బు తిరిగి ఇచ్చేది లేదని అన్బునాథన్ ప్రకాష్‌ను బెదిరించినట్లు సమాచారం.

కరూర్ జిల్లా క్రైం బ్రాంచ్ పోలీసులకు ప్రకాష్ ఫిర్యాదు మేరకు కరూర్ జిల్లా ఆర్థిక నేరాల విభాగం పోలీసులు గత వారం రోజులుగా అన్బునాథన్ కోసం గాలిస్తున్నారు. అన్బునాథన్ పరారీలో ఉన్నట్లు సమాచారం.ఈరోజు ఏఐఏడీఎంకే నేత అన్బునాథన్‌ను అయ్యంపాళయంలోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు.ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్న వియం తెలిసిందే. రాజకీయ కక్షల కారణంగా కాకపోయినా ఏదో ఒక రకంగా బయటపడాలని అనుకున్న వ్యాపారి అధికార పార్టీ నాయకులను ఆశ్రయించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+