లగ్జరీ కారులో ఐటీ హబ్ లోకి ఎంట్రీ, కిలాడీ లేడీస్ బ్యాచ్, ఆంధ్రాలో పెళ్లి అంటూ !
బెంగళూరు: పెళ్లిళ్లతోపాటు శుభకార్యాలకు బట్టలు కొనుగోలు చేసే కస్టమర్ల ముసుగులో బట్టల షోరూమ్ ల్లోకి వెళ్లి రూ. లక్షల రుపాయల విలువైన ఖరీదైన చీరలను చోరీ చేసి పారిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మహిళలతో సహా ఏడుగురు నిందితులను బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఆంధ్రా లేడీస్ ఏం చేశారు అని పోలీసులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మట్టపాటి రాణి అలియాస్ రాణి, ఈటా సునీత, రత్నాలు, శివరామ్ ప్రసాద్, వెంకటేష్, తన్నీరు శివకుమార్ , భరత్ అనే నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 4 లక్షల విలువైన 22 చీరలు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు నగరంలోని హైగ్రౌండ్స్ పోలీసు అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా నుంచి నిందితులు ఇటీవల బెంగళూరు నగరంలోని సాంకీ రోడ్డులోని పెన్రీవ్ ఎంటర్‌ప్రైజెస్, రెయిన్ ట్రీ హోటల్‌లోకి వెళ్లారు. తరువాత ఖరీదైన చీరలను దోచుకున్నారు. లక్షల రూపాయల విలువ చేసే నాలుగు చీరలు, బ్లౌజ్ చోరీ చేసి కారులో చాకచక్యంగా పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
పెళ్లిళ్లతోపాటు శుభకార్యాలకు దుస్తులు కొనుగోలు చేసే కస్టమర్ల ముసుగులో నిందితులు ఆంధ్రప్రదేశ్ నుంచి కార్లలో బెంగళూరు నగరానికి వచ్చేవారు. మొదట్లో ప్రతిష్టాత్మకమైన బట్టల దుకాణాలకు, షోరూమ్ ల్లోకి మహిళలు వెళ్లేవారు. డిఫరెంట్ డిజైన్ చీరలు చూపించమని సిబ్బందిని అడిగేవాడు. ఈ సమయంలో పురుషులు అదే బట్టల దుకాణంలోకి ప్రవేశించి వారికి బట్టలు, చీరలు చూపించాలని చెప్పి షోరూమ్ లోని సిబ్బంది దృష్టిని మరల్చారు.

ఈ సమయంలో మహిళలు ఖరీదైన చీరలను దొంగిలించి వారి చీరలల్లోపల దాచుకునేవారు. ఇలా వందల సంఖ్యలో చీరలు చూపించమని చెప్పి చీరలు చోరీ చేసిన తరువాత అతి తక్కువ ధరలకు ఒకటి రెండు చీరలు ఆ షోరూమ్ లో నుంచి బయటకు వచ్చి ఆ స్థలం ఖాళీ చేసేవారని పోలీసులు అన్నారు. నిందితులు బెంగళూరులో దొంగిలించిన చీరలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లి తక్కువ ధరకు విక్రయించేవారని విచారణలో తేలింది.
బెంగళూరు నగరంలోని సాంకీ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో చీరలు చోరీ చేసి పారిపోవడంతో షోరూమ్ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు షోరూమ్ లో చీరలు చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీని ఆధారంగా షాపు యజమాని హైగ్రౌండ్స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లో దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశామని బెంగళూరులోని హైగ్రౌండ్ పోలీసు అధికారులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications