వెంటపడి ప్రేమించావు! ఇప్పుడేమో ముఖంచాటేస్తావా?: యువకుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి.. తను ప్రేమించిన వ్యక్తిపై యాసిడ్ దాడికి పాల్పడింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇద్దరూ ప్రేమించుకున్నారు..
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవన్‌గఢ్‌కు చెందిన ఫైజద్ అనే 20ఏళ్ల యువకుడు గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం వీరి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు.

ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డావు..
ఈ క్రమంలో అతడిపై కోపం పెంచుకున్న యువతి.. ఇలా ఎందుకు చేస్తున్నావంటూ అతడ్ని ప్రశ్నించింది. ఇన్నాళ్లు ప్రేమిస్తున్నానని వెంటపడి.. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఎందుకు అంగీకరించడం లేదంటూ నిలదీసింది.

యవతి ఆగ్రహంతో...
అయితే, ఫైజద్ మాత్రం ఆమెకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను అతడి ముఖంపై పోసిందా యువతి. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత యువతి అక్కడ్నుంచి పరారైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లంటూ వేధింపులకు దిగిందంటూ..
యాసిడ్ దాడికి పాల్పడిన సదరు యువతిపై సెక్షన్ 326ఏ కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితురాలైన యువతి, తన కుమారుడు ప్రేమించికున్నారని, అయితే గత కొంతకాలంగా మాట్లాడుకోవడం లేదని బాధితుడి తల్లి చెప్పింది. పెళ్లి చేసుకోవాలని సదరు యువతి వేధింపులకు పాల్పడిందని, ఫైజద్ ఒప్పుకోకపోవడంతో ఇలా యాసిడ్ దాడికి పాల్పడిందని ఆరోపించింది. కాగా, స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.












Click it and Unblock the Notifications