ఒకేసారి జిమ్ కు వెళ్లారు. అపార్ట్ మెంట్ లో పెళ్లికాకుండానే కాపురం, సార్ దెబ్బకు మేడమ్!

లక్నో/గాజియాబాద్: ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులకు షాకింగ్ సమాచారం చిక్కింది. ఆత్మహత్య కేసులో పింకీ గుప్తా అనే బాధితురాలు ఆగస్టు 31న ఘజియాబాద్‌లోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఈ కేసులో పోలీసులకు సూసైడ్ నోట్ కూడా లభించింది.

పోలీసులకు దొరికిన చేతితో రాసిన సూసైడ్ నోట్‌లో బాధితురాలు పింకీ గుప్తా తన ఆత్మహత్యకు తన లైవ్ ఇన్ భాగస్వామి షకీబ్ అలీనే కారణం, అతని వలనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసింది. జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న పింకీ గుప్తా ( 24) అనే యువతికి నాలుగేళ్ల క్రితం షకీబ్ అలీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకే జిమ్‌లో వర్క్‌అవుట్ చేసారు. వైశాలి ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని అక్కడే ఇద్దరు కాలం గడపడం మొదలుపెట్టి తరువాత ప్రేమించుకున్నారు.

A girlfriend who committed suicide because her cohabiting boyfriend was cheating in Uttar Pradesh

ఆ తర్వాత లైవ్-ఇన్ భాగస్వాములు అయ్యారు. పింకీ తన ఇంటిని విడిచిపెట్టి గత నాలుగు సంవత్సరాలుగా ప్రియుడు షకీబ్ ఆలీతోనే ఉంటోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పింకీ గుప్తా షకీబ్‌ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. కానీ అతను ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. తానుకేవలం స్నేహితుడిగా, ప్రియుడిగానే ఉండాలనుకుంటున్నానని షకీబ్ అతని ప్రియురాలు పింకీ గుప్తాకు చెప్పాడు.

అయితే పింకీ గుప్తా ఆమె ప్రియుడు షకీబ్ కు అప్పటికే పెళ్లయిందని ఇటీవలే గుర్తించింది. అయితే షకీబ్ మాత్రం అతని ప్రియురాలు పింకీ గుప్తాకు ఇంతకాలం అబద్ధం చెప్పాడు. అసలు మ్యాటర్ తెలుసుకున్న పింకీ షాక్ అయ్యింది. ఇది వారి అక్రమ సంబంధంలో చీలికకు కారణమైంది. ఈ నేపథ్యంలో పింకీ గుప్తా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం.

విషాద సంఘటన జరిగిన రోజు రాత్రి, ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు, అర్దరాత్రి షకీబ్ అతని ఇంటి నుండి వెళ్లిపోయాడు, పింకీ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

త్వరితగతిన విచారణ జరిపిన అధికారులు పింకీ గుప్తా డైరీని, ఆమె ఫోన్‌ను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పింకీ గుప్తా 2018 నుంచి డైరీ రాస్తోందని ఏసీపీ స్వతంత్ర కుమార్ సింగ్ స్థానిక మీడియాకు తెలిపారు. మరోవైపు షకీబ్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. లవ్ జీహాద్ లో భాగంగానే షకీబ్ అతని ప్రియురాలు పింకీ గుప్తా జీవితంతో ఆడుకున్నాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+