కిక్కే కిక్కు, ఉదయం నుంచి క్వాటర్ మీద క్వాటర్లు, అమ్మాయిలతో ప్రభుత్వ స్కూల్ టీచర్ పాడుపనులు !
బెంగళూరు: మద్యం సేవించి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు దాడి చెయ్యడానికి ప్రయత్నించారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా రంటావాలా గ్రామంలో చోటుచేసుకుంది.ఉపాధ్యాయుడు లక్ష్మీకాంత్ ఆగడాలపై గ్రామస్తులు మండిపడుతున్నారు.
మధుగిరి తాలూకాలోని మిడిగేశి హోబలి రెంటావాలా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మీకాంత్ అనే ఉపాధ్యాయుడు రోజూ ఉదయం మద్యం తాగి స్కూల్ కు వస్తున్నాడు. తరువాత విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపణలు ఉన్నాయి, తరువాత మద్యాహ్నం మరో క్వాటర్ మద్యం సేవిస్తున్న టీచర్ తరువాత భోజనం చేసి గంట సేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ పాఠాలు చెబుతున్నాడని తెలిసింది.

మద్యం మత్తులో టీచర్ లక్ష్మీకాంత్ అమ్మాయిల శరీరం మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వెలుగు చూసింది. తరువాత విద్యార్థినుల నుంచి డబ్బులు కావాలంటూ టీచర్ లక్ష్మీకాంత్ వాళ్లను వేధించడం మొదలుపెట్టాడు. దిక్కుమాలిన టీచర్ లక్ష్మికాంత్ అమ్మాయిలను దగ్గరకు పిలిచి నేను మీ నాన్నకు స్నేహితుడిని అంటూ పిల్లల శరీరాన్ని తాకి వారిని ఆప్యాయంగా మాట్లాడేవాడిలా నటించాడని, అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ తాకుతున్నాడని అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఉపాధ్యాయుడు లక్ష్మీకాంత్ తీరుతో విద్యార్థినులు బడికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. చాలా అమంది అమ్మాయిలు మేము స్కూల్ కు వెళ్లమని వాళ్ల తల్లిదండ్రులకు చెప్పాడు. ఉపాధ్యాయుడు లక్ష్మీకాంత్ తీరుపై విద్యార్థినులు తమ తల్లిదండ్రుల వద్ద బోరున విలపించారు. అమ్మాయిల బాధలు తెలుసుకున్న వాళ్ల కుటుంబ సభ్యులు స్కూల్ వద్దకు వెళ్లి టీచర్ లక్ష్మీకాంత్ మీద విరుచుకుపడ్డారు. ఆ సందర్బంలో కూడా లక్ష్మీకాంత్ మద్యం మత్తులో ఉన్నాడని తెలిసింది.
చివరికి గ్రామస్తులు కొందరు విద్యార్థుల కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి టీచర్ లక్ష్మీకాంత్ ను రక్షించారు. కామాంధుడైన ఉపాధ్యాయుడు లక్ష్మీకాంత్ ను వెంటనే వేరే ప్రాంతానికి బదిలి చెయ్యాలని, లేదంటే అరెస్టు చెయ్యాలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు అమ్మాయిలను రహస్యంగా విచారణ చేసి వారి నుంచి సమాచారం తెలుసుకుని విచారణ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ విషయంపై తమకు లిఖితపూర్వకంగా ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యలేదని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications