జిమ్ సెంటర్ లో అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటున్న జిమ్ ట్రైనర్, అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తులో!
చాలా ఏళ్ల నుంచి జిమ్ కు వెళ్లి కండలు పెంచిన యువకుడు బాలీబిల్డర్ గా తయారైనాడు. కొంతకాలం ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేశాడు. ఉద్యోగం చెయ్యడానికి ఐటీ హబ్ వచ్చిన అతను ఓ ప్రముఖ జిమ్ సెంటర్ లో జిమ్ ట్రైనర్ గా ఉద్యోగంలో చేరాడు. జిమ్ సెంటర్ కు వచ్చి వెలుతున్న యువతులు, వివాహిత మహిళలతో అతను చనువుగా ఉంటున్నాడు.
అర్దరాత్రి అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందపడిన ఆ జిమ్ ట్రైనర్ శవం అయ్యాడు. బెంగళూరులోని పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో జిమ్ ట్రైనర్ నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ భవనం టెర్రస్ పై నుంచి పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హరళూరు-సర్జాపూర్ ప్రధాన రహదారిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న గణేష్ పాండా అలియాస్ గణేష్ (32) ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 11. 30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని బెంగళూరు పోలీసులు తెలిపారు.

ఒడిశాకు చెందిన గణేష్ పాండా మూడేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చి సర్జాపుర మెయిన్ రోడ్డులోని ప్రముఖ జిమ్ సెంటర్ లో ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. హరళూరు- సర్జాపుర రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో గణేష్ అతని అక్కా, బావతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇటీవల గణేష్ విపరీతంగా మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడని తెలిసింది. గణేష్ కు మద్యం తాగడం వదిలించాలని అతని అక్కా, బావ చాలా ప్రయత్నించారని తెలిసింది.
అయితే జిమ్ ట్రైనర్ గణేష్ మద్యం తాగడం మాత్రం వదల్లేదు. మద్యం వ్యసనం నుంచి గణేష్ బయటపడలేకపోడని తెలిసింది. రాత్రి గణేష్ అతని అక్కా బావతో కలిసి డిన్నర్ చేశాడు రాత్రి 11. 30 గంటల సమయంలో గణేష్ అపార్ట్ మెంటో లోని నాలుగో అంతస్తు మీద ఉన్న టెర్రాస్ మీదకు వెళ్లాడు. ఆపై ఒక్కసారిగా గణేష్ కిందకు పడిపోయాడు. దీంతో గణేష్ తల, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గణేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గణేష్ పాండా ఆత్మహత్యకు కచ్చితమైన కారణం తెలియరాలేదు. ఘటనా స్థలంలో డెత్ నోట్ చిక్కలేదని పరప్ప అగ్రహార పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. జిమ్ సెంటర్ లో గణేష్ తో క్లోజ్ గా ఉంటున్న వారిని, ఆ జిమ్ సెంటర్ యజమానిని పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications