ముస్లీం అమ్మాయితో లవ్, హిందూ యువకుడిని 7 ముక్కలుగా నరికేసి కాలువలో!
హిమాచల్ ప్రదేశ్/ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ముస్లిం యువతిని ప్రేమించినందుకు 21 ఏళ్ల యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని 7 ముక్కలుగా నరికి కాలువలో పడేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది.మనోహర్ లాల్ అలియాస్ మనోహర్ అనే యువకుడు దారుణ హత్యకు గురైనాడు. ముస్లిం యువతిని ప్రేమిస్తున్నాడన్న కారణంతో ఆ యువతి ఇంట్లోని ముగ్గురు సభ్యులు మనోహర్‌ను రాళ్లతో కొట్టి చంపారని పోలీసులు అంటున్నారు.
అనంతరం మనోహర్ మృతదేహాన్ని 7 ముక్కలుగా నరికి కాలువలో పడేశారు. జూన్ 6న అదృశ్యమైన మనోహర్ మృతదేహం 9వ తేదీన డ్రెయిన్‌లో లభ్యం అయ్యింది. పోస్టుమార్టం అనంతరం మనోహర్ ను రాళ్లతో కొట్టి చంపి తరువాత దారుణంగా ముక్కలు చేశారని వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించి బాలిక సోదరుడు షబ్బీర్ సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రుక్సానా అనే ముస్లిం యువతితో మనోహర్ లాల్ రిలేషన్ షిప్ లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఆమె కుటుంబ సభ్యులు వీళ్ల ప్రేమకు అనుకూలంగా లేరు. జూన్ 6న బయలటకు వెళ్లిన మనోహర్ ఇంటికి తిరిగి వస్తుండగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు మనోహర్ కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి మిస్సింగ్ కేసు పెట్టారు. మూడు రోజుల తర్వాత కాలువలోని గోనె సంచి నుండి దుర్వాసన రావడం గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ప్థానికులు హడలిపోయి గోనెసంచి గురించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్‌ని స్వాధీనం చేసుకుని చూడగా నరికివేయబడిన మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో హత్యకు గురైయ్యింది మనోహర్ లాల్ అని వెలుగు చూసింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న హిందూ సంస్థలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐపీసీ సెక్షన్ 302 మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేయబడింది. నిందితుల పేర్లను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించినప్పటికీ స్థానిక మీడియా కథనాలు నిందితుల్లో ఒకరిని షబ్బీర్‌గా గుర్తించారు. కోర్టు అతడిని పోలీసు కస్టడీకి పంపింది. షబ్బీర్ మనోహర్ ప్రియురాలు రుక్సానా సోదరుడని స్థానిక మీడియా తెలిపింది. మొత్తం మీద ముస్లీం యువతిని ప్రేమించిన హిందూ యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు 7 ముక్కలుగా నరకడం హిమాచల్ ప్రదేశ్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications