భార్యకు అక్రమ సంబంధం, విడాకులు ఇచ్చిన భార్యను చంపడానికి రివాల్వర్ !
బెళగావి/ సాంగ్లీ: కుటుంబ సభ్యులంతా కలసి పెళ్లి చేసుకుంటున్న జంట ఎప్పటికైనా సంతోషంగా ఉండాలనే ఆశతో చాలా గ్రాండ్ గా పెళ్లి చేశారు. వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంతకాలం చక్కగానే కాపురం చేశాడు. తరువాత భర్తకు అతని భార్య మీద అనుమానం వచ్చింది. పదేపదే భార్య తీరుతో విపరీతమైన అనుమానం పెంచుకున్న భర్త ఇక లాభం లేదని ఆమెకు విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చి నెల కాకుండా భార్యను చంపేయడానికి భర్త రివాల్వర్ కొన్నాడు.
వివాహం చేసుకున్న కొన్నేళ్ల తరువాత తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెను చంపేందుకు కంట్రీ మేడ్ పిస్టల్ కొనుగోలు చేశాడు. భార్య చంపేచాలని స్కెచ్ వేసిన భర్త ఇప్పుడు పోలీసులకు చిక్కిపోయాడు. .

భార్యను చంపేందుకు కంట్రీ మేడ్ పిస్టల్ కొనుక్కున్న భర్తకు పోలీసులు బెండ్ తీస్తున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే కేవలం 15 రోజుల క్రితం భార్యకు ఆమె భర్త విడాకులు ఇచ్చి చివరికి ఆమెను హత్య చేయాలని స్కెచ్ వేశాడు.
తన భార్యకు వేరొకరితో సంబంధం ఉందనే అనుమానంతో ఆమె హత్యకు స్కెచ్ వేశాడు. సచిన్ బాబాసాహెబ్ రాయమనే అలియాస్ సచిన్ అనే యువకుడు అరెస్టు అయ్యాడనని పోలీసులు అన్నారు. సాంగ్లీ జిల్లా మీరజ్ తాలూకా కుపవాడ గ్రామంలో సచిన్ కంట్రీ మేడ్ పిస్టల్‌ను కొనుగోలు చేశాడు. భార్యను చంపేందుకు పిస్టల్ కొనుక్కున్న సచిన్ దానిని ఎలా భద్రంగా దాచుకోవాలో అనే విషయంలో తికమకపడ్డాడు.
చేతిలోకి ఒక్కసారిగా పిస్తోల్ రావడంతో సచిన్ ఆందోళన చెందాడు. సచిన్ పిస్టల్ కొనుగోలు చేసి నేరుగా మీరజ్ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సచిన్ మీద పోలీసులకు డౌట్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన మహారాష్ట్ర పోలీసులు సచిన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.

అయితే చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్న సచిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లారు. అప్పుడు సచిన్ వద్ద కంట్రీ మేడ్ పిస్టల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో సచిన్ తన భార్యను చంపేందుకు రివాల్వర్ కొన్నట్లు అంగీకరించాడు. వెంటనే రైల్వే పోలీసులు మీరజ్ నగర్ గాంధీచౌక్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందించారు.
వాస్తవానికి కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని చిక్కోడి నివాసి అయిన సచిన్ భార్య కూడా తన భర్త తనను వేధిస్తున్నాడంటూ ఇటీవల సచిన్‌పై చిక్కోడిలో ఫిర్యాదు చేసిందని, తనకు రక్షణ కల్పించాలని, తన భర్త సచిన్ వలన తనకు ప్రాణహాని ఉందని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మీరాజ్ లోని గాంధీ చౌక్ పోలీస్ స్టేషన్ లో, కర్ణాటకలోని చిక్కోడి పోలీస్ స్టేషన్లలో సచిన్ మీద ప్రత్యేక కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నామని రెండు రాష్ట్రాల పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications