Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్లామ్ తో పండగ చేసుకుంటన్న ప్రియుడు, పక్కాప్లాన్ వేసిన భర్త ఏం చేశాడంటే ?, దెబ్బకు !

భార్యతో అనైతిక సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కొడవలితో నరికి చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన సంఘటన కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని సింధనూరు తాలుకాలో చోటుచేసుకుంది. సింధనూరు తాలూకాలోని బలగనూర్‌ గ్రామానికి చెందిన ఖాదర్‌పాషా (35) హత్యకు గురయ్యాడు. మారుతి అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె భర్త మారుతి పలుమార్లు బుద్దిచెప్పాడు.

అయినా ఖాదర్ పాషా పట్టించుకోకుండా మారుతి భార్యతో అతను రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టాడు. మారుతి ఇంటి నుంచి బయటక వెళ్లిన వెంటనే అతని ఇంటికి వెలుతున్న ఖాదర్ పాషా అతని భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. పని మీద, శుభకార్యాలకు, స్నేహితులతో పార్టీలు చేసుకోవడానికి మారుతి ఊరి నుంచి బయటకు వెళ్లిన తరువాత అతని భార్యతో ఖాదర్ పాషా పండగ చేసుకుంటున్నాడు. ప్రియుడు ఖాదార్ పాషా వచ్చేదే ఆలస్యం అంటూ ప్రియురాలు కూడా రొమాన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

A husband brutally murdered a man who had an illicit relationship with his wife in Karnataka

తన భార్యతో ఖాదర్ పాషా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడని తెలుసుకున్న మారుతి రగిలిపోయాడు. పద్దతి మార్చుకోవాలని, అక్రమ సంబంధం మానుకోవాలని మారుతి అతని భార్య, ప్రియుడు ఖాదర్ పాషాను చాలాసార్లు హెచ్చరించాడు. అయినా కూడా ఇద్దరూ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కోపోద్రిక్తుడైన మారుతి అతని భార్య బాయ్ ఫ్రెండ్ ఖాదర్ పాషాకు మొబైల్ ఫోన్ కు ఫోన్ చేసి తుగ్గలదిన్ని వైపు వెళ్లే దారిలో బలగనూరు సమీపంలోని బావి వద్ద నీతో మాట్లాడాలని కోరాడు.

భార్య ప్రియుడు ఖాదర్ పాషా చెప్పినచోటకు వచ్చిన వెంటనే అతన్ని దారుణంగా హత్య చేశాడు. తరువాత ఖాదర్ పాషా ప్రాణం పోయిందని నిర్దరాంచుకున్న అనంతరం మారుతి బలగనూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఖాదర్ పాషాను తానే హత్య చేసినట్లు అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న రాయచూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నిఖిల్, డీఎస్పీ బీఎస్ తల్వార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు.

A husband brutally murdered a man who had an illicit relationship with his wife in Karnataka

తరువాత జిల్లా ఎస్పీ మారుతి నివాసం ఉంటున్న గ్రామానికి వెళ్లి గ్రామస్తుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. అనంతరం ఖాదర్ పాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సింధనూరు తాలూకా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బలగనూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. తన భార్యను వదిలేయాలని, మా కుటుంబం జోలికిరాకూడదని తాను పదేపదే ఖాదర్ పాషాకు చెప్పినా అతను తన మాట వినలేదని, అందుకే చంపేశానని మారతి అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+