చెల్లెలి భర్తతో ఎంజాయ్ చేస్తున్న భార్య, బంగారు నగల వ్యాపారం ఏం చేశాడంటే?, అర్దరాత్రి!
తన భార్యతో తోడల్లుడికి అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో బంగారు నగల వ్యాపారం చేసే వ్యక్తి వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తిని దారుణంగా హత్య చేసి అతని మృతదేహాన్ని బెంగళూరు సిటీ శివార్లలోని అటవి ప్రాంతంలో విసిరేశాడు. బంగారు వ్యాపారి హత్య కేసులో అతని సోదరుడు, అతని స్నేహితుడిని బెంగళూరులోని హలాసూర్ గేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరులోని సిటీ మార్కెట్ సమీపంలోని నగర్తపేట్ కు చెందిన షాజవాన్, అతని అనుచరుడు బబ్లూను అరెస్టు చేశామని గురువారం పోలీసులు తెలిపారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పి రాత్రి మహ్మద్ అత్తర్ అలీ అలియాస్ ఆలీ (49)ని నిందితులు మారతహళ్లి సమీపంలోని వర్తూరు శివార్లలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లారు. తరువాత ఆలీని అక్కడే చంపేసి అతని శవాన్ని అటవి ప్రాంతం సమీపంలో విసిరేసిన నిందితులు తరవాత నగర్త్ పేట్ కు వచ్చేశారు.

హత్యకు గురైనా ఆలీ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి దర్యాప్తు చెయ్యడంతో అతను హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సమేతంగా నగర్త్ పేట్ లో నివాసముంటున్న మహ్మద్ అత్తర్ అలీ ఇంటి సమీపంలో బంగారు నగల దుకాణం పెట్టుకున్నాడు. ఇటీవల అలీతో వ్యాపార సంబంధాలు నెరిపిన అతని తోడల్లుడు షాజవాన్ అతనితో క్లోజ్ గా ఉండేవాడని తెలిసింది. తన భార్యతో అలీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని షాజవాన్ అనుమానించాడు.
ఇదే సమయంలో షాజవాన్ భార్య కూడా ఆమె బావ ఆలీతో చాలా క్లోజ్ గా ఉండటం మొదలుపెట్టిందని తెలిసింది. బావ ఆలీతో కలిసి ఆమె బయట తిరగడం మొదలుపెట్టింది. బంగారు నగల వ్యాపారం చేస్తున్న షాజవాన్ ఎప్పుడుపడితే అప్పుడు షాపులో నుంచి బయటకు వెళ్లలేక, అతని భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోలేక సతమతం అయ్యాడని తెలిసింది. ఇదే విషయంలో తోడల్లుడు ఆలీ మీద షాజవాన్ కక్ష పెంచుకున్నాడు.
తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆలీని ఎలాగైనా అంతం చెయ్యాలని షాజవాన్ ప్లాన్ చేశాడు. కొంతకాలం క్రితం ఇదే విషయమై ఆలీ, షాజవాన్ ల మధ్య మనస్పర్థలు పెరిగాయి. రెండుమూడు సార్లు షాజవాన్, ఆలీ కుటుంబ సభ్యుల ముందే గొడవపడ్డారని తెలిసింది. తరువాత కుటుంబ సభ్యులు ఇద్దరిని నచ్చచెప్పడంతో కొంతకాలంగా ఆలీ, షాజవాన్ కలసి బంగారు నగల వ్యాపారం చేస్తున్నారని సమాచారం. షాజవాన్ అతని సహచరుడు బబ్లూతో కలిసి అలీని హత్య చేసేందుకు పథకం పన్నారు.

తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు ఇప్పిస్తానని ఆలీని నమ్మించి సోమవారం రాత్రి నిందితులు అలీని బైక్ లో వర్తూరు సమీపంలోని నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లి అక్కడ కత్తులతో అతన్ని దారుణంగా పొడిచి చంపేశారు. తరువాత ఆలీ మృతదేహాన్ని వర్తూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి అక్కడి నుంచి బెంగళూరులోని సిటీ మార్కెట్ కు వచ్చేశారు.
అర్దరాత్రి రాత్రి అయినా భర్త ఆలీ ఇంటికి రాకపోవడంతో అతని భార్య అర్ధరాత్రి 2 గంటలకు హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆలీ అదృశ్యం వెనుక తన బంధువు షాజవాన్ హస్తం ఉందని కూడా ఆమె ఆరోపించారు. షాజవాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆలీ హత్య మిస్టరీ బయటపడిందని హలసూరు గేట్ పోలీసు అధికారులు తెలిపారు. ఆలీ హత్య కేసులో షాజవాన్ స్నేహితుడు బబ్లూ కూడా అరెస్టు అయ్యాడు.












Click it and Unblock the Notifications