భార్యను సింపుల్ గా చంపేసి ఆత్మహత్యాయత్నం చేసిన భర్త, అసలు మ్యాటర్ !

ముంబాయి/మహారాష్ట్ర: సొంత పోలాలు ఉన్న యువకుడు వ్యవసాయం చేయిస్తున్నాడు. కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్న ఆ యువకుడికి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లికి ముందే మా అమ్మాయి పొలంకు వెళ్లి వ్యవసాయం చెయ్యదని ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికొడుక్కి చెప్పారు. మీ అమ్మాయిని పొలం పనులకు పంపించమని, ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని, కూలీలతోనే వ్యవసాయం చేయిస్తామని అప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత కథ రివర్స్ అయ్యింది.

మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో గోపాల్ సదన్ అలియాస్ గోపాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జయా అనే యువతిని వివాహం చేసుకున్న గోపాల్ అతని భార్యతో చక్కగా కాపురం చేశాడు. వ్యవసాయం చేయిస్తున్న గోపాల్ డబ్బు కూడా బాగానే సంపాధిస్తున్నాడు. భర్త గోపాల్, అత్తమామలతో కలిసి ఒకే ఇంటిలో జయా నివసిస్తోంది.

deadbody
ఇటీవల జయాకు, ఆమె భర్త గోపాల్‌కు తరచూ గొడవలు జరుగుతున్నాయి. జయా చెప్పిన మాట వినడం లేదని, ఆమెను ఎండలో పొలం పనులు చేయించాలని గోపాల్ తో పాటు అతని తల్లిదండ్రులు డిసైడ్ అయ్యారు. గోపాల్ వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అతని భార్య జయాను పొలాల్లో పని చేయాల్సిందిగా ఒత్తిడి చేశాడు. పెళ్లికి ముందే తాను వ్యవసాయం చెయ్యనని చెప్పానని, ఇప్పుడు వ్యవసాయం చెయ్యమని చెబితే ఎలా అంటూ జయా ఆమె భర్త, అత్తమామలను నిలదీసింది.

పొలంలో పని చేయ్యడానికి జయా నిరాకరించింది. ఇదే సమయంలో జయా ఆమె అత్తారింటిలో ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించింది. పోలీసులకు అనుమానం వచ్చి జయా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇందులో జయా హత్యకు గురైయ్యిందని వెలుగు చూసింది. దీంతో పోలీసులు జయా భర్త గోపాల్‌తో పాటు అతని తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. ఉదయం జయా, ఆమె భర్త గోపాల్ మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన గోపాల్, అతని తల్లిదండ్రులు కలిసి జయా గొంతు నులిమి హత్య చేశారు. జయా చనిపోవడంతో పోలీసులకు బయపడిన గోపాల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు అన్నారు. జయా అత్తమామలను అరెస్టు చేశామని, గోపాల్ ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని, అతను కోలుకున్న తరువాత అరెస్టు చేసి విచారణ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+