ఈ అక్క చాలా పవర్ ఫుల్ రాసామి, స్కూటర్ విలువ రూ 36 వేలు, ఆమెకు వేసిన ఫైన్ లక్షల్లోనే !

బెంగుళూరులో ట్రాఫిక్ ఇబ్బంది ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుంటే ఇతర వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే మహిళలు ట్రాఫిక్ నియమాలు పాటించకుంటే ఎలాగవుంటుందో ఊహించుకుంటే భలే ఉంటుంది

బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇందుకు తాజా ఉదాహరణగా నలిచింది. మహిళలు ప్రభుత్వ నియమాలు తప్పకుండా పాటిస్తారని పెద్దలు కూడా చెబుతుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ మహిళ ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించింది. ఆ మహిళ 270 సార్లు బెంగళూరులో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి చివరికి పోలీసులకు చిక్కారు. స్కూటర్ డ్రైవింగ్‌ చేసే సమయంలో హెల్మెట్‌ ధరించకపోవడం, వెనుక కూర్చొని హెల్మెట్‌ ధరించకపోవడం ఆమె చేసిందని పోలీసులు తెలిపారు.

A lady who broke traffic rules 270 times in Bengaluru and rode a scooter

అలాగే ఆమె బైక్ నడుపుతున్న సమయంలో మొబైల్‌ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపారని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన ఆ మేడమ్ ఏకంగా 270 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు సీసీటీవీ కెమెరాల్లో చిక్కింది. నిబంధనలు ఉల్లంఘించిన ఆమెకు పోలీసులు రూ.1,36,000 జరిమానా విధించారు. బెంగళూరుకు చెందిన ఆ మహిళ ఎప్పుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారనే సమాచారం బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

బెంగుళూరులొ నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు సహనం కోల్పోతున్నారు. బెంగళూరులో ఏ రోజుల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో తెలుసుకోవడం కూడా చాలా కష్టం. KA03, JE-5705 రిజిస్ట్రేషన్ గల హోండా యాక్టివా స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఆ మహిళ ఇప్పటి వరకు ఏకంగా 270 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిందని బెంగళూరు ట్రాఫిక్ పోలీసు అధికారులు అంటున్నారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు పోలీసులు, ప్రజలు గుర్తించారు. వారి ఫొటోలు తీసి పోలీసులకు ట్యాగ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బెంగళూరులోని సుధామనగర్ తో పాటు ఆ ఏరియా చుట్టుపక్కల ప్రాంతంలో ఆ మహిళతో పాటు ఆమె కుటుంబం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సిగ్నల్ జంపింగ్, ముందు, వెనుక రైడర్లు ఇద్దరూ హెల్మెట్ ధరించకపోవడం, వన్ వేలో వెళ్లడం చేశారని పోలీసులు అన్నారు.

అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుకోవడం ఇలా మొత్తం 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించారని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరులో ఓ మహిళ ఇన్ని సార్లు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించారని కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యుల పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తపడిన పోలీసులు వారు ఉపయోగిస్తున్న వాహనం నెంబర్, ఏరియా పేరు మాత్రం మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+