లాయర్ కావలని పీజీలో ఏం అయ్యాడంటే ?, ఐటీ హబ్ లో !

బెంగళూరు: కాలేజ్ లో చదువుకుంటున్న యువకుడు లాయర్ కావాలని ఆశపడ్డాడు. డిగ్రీ పూర్తి అయిన తరువాత ఐటీ హబ్ లోని లా కాలేజ్ లో చేరిన యువకుడు చక్కగా చదువుకుంటున్నాడు. పీజీలో నివాసం ఉంటున్న యువకుడు ప్రతిరోజు కాలేజ్ లోకి వెళ్లి వస్తున్నాడు. పీజీలోని రూమ్ లో సాటి ఫ్రెండ్స్ బయటకు వెళ్లి వచ్చి చూడగా లా కాలేజ్ స్టూడెంట్ శవమై కనిపించడం కలకలం రేపింది.

హిమాచల్ ప్రదేశ్ లో ఆర్య కుమార్ నడ్డా (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చదువులో ముందు ఉండే ఆర్య కుమార్ నడ్డా లాయర్ కావాలని అనుకున్నాడు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న సమయంలో లా కాలేజ్ లో సీటు సంపాధించాలని ఆర్య కుమార్ నడ్డా కర్ణాటకలోని పోటీ పరీక్షల్లో ఎంట్రన్స్ పరీక్షలు రాశాడు.

 PG

బెంగళూరు నగరంలోని కేఎల్ ఇ సోసైటీ లా కాలేజ్ లో ఆర్య కుమార్ నడ్డాకు సీటు వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి బెంగళూరు చేరకున్న ఆర్య కుమార్ నడ్డా అన్నపూర్ణేశ్వరి నగర్ లోని డి గ్రూప్ లేఔట్ లోని ఓ బాయ్స్ పీజీ సెంటల్ లోని రూమ్ లో చేరాడు. పీజీలో నివాసం ఉంటున్న ఆర్య కుమార్ నడ్డా కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు.

కాలేజ్ ఉన్న సమయంలో ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్న ఆర్య కుమార్ నడ్డా సెలవుల రోజుల్లో ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లి వస్తున్నాడు. ఆదివారం స్నేహితులు బయటకు వెలుతామని ఆర్య కుమార్ నడ్డాకు చెప్పారు. అయితే తనకు ఎక్కువ తలనొప్పిగా ఉందని, తాను బయటకు రాలేని అతని ఫ్రెండ్స్ కు చెప్పాడు.

ఆదివారం మద్యాహ్నం పీజీలోని ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్లిపోవడంతో ఆర్య కుమార్ నడ్డా మాత్రమే ఇంట్లో ఉన్నాడు. తరువాత బయట షాపింగ్ లు చేసుకుని సినిమా చూసుకుని ఫ్రెండ్స్ పీజీకి చేరుకుని చూడగా ఆర్య కుమార్ నడ్డా ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించాడు. హడలిపోయిన యువకులు వెంటనే పీజీ యజమానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

law college

పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకుని పరిశీలించి ఆధారాలు సేకరించి ఆర్య కుమార్ నడ్డా శవాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆర్య కుమార్ నడ్డా ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, హిమాచల్ ప్రదేశ్ లోని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నామని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+