కట్టుకున్న దానికి దిక్కులేదు కాని ఉంచుకున్న దాని కోసం పెరోల్ కావాలా ?, కామంతో... !!

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ఎలాగైనా జైలు నుంచి బయటకు రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. యావజ్జీవ శిక్ష పడిన వ్యక్తి ఓ లాయర్ ను పెట్టుకుని తనకు పెరోల్ కావాలని కోర్టును ఆశ్రయించాడు. పెరల్ అర్జీ పరిశీలించిన న్యాయమూర్తి ఆ ఖైదీ ఆశచూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిసింది.

ఒక ఖైదీకి కోర్టు షరతులతో కొంతకాం జైలు నుంచి విడుదల చెయ్యడాన్ని పెరోల్ అంటారు. కోర్టు ఖైదీకి కొన్ని షరతులు విధిస్తుంది. జైలు నుంచి బయటకు వచ్చినా ఆ షరతులు పాటించాల్సిందే. అతను దానిని మరచిపోయినా, కోర్టు నిబంధనలను ఉల్లంఘించినా కోర్టు అతన్ని కటకటాల వెనక్కి పంపుతుంది. తమకు పెరోల్ మంజూరు చేయాలని దేశ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ఖైదీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

A life convict has filed a parole plea in court asking him to have sex with the lady he was cohabiting with

ఢిల్లీ హైకోర్టులో ఓ పెరోల్ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ ఖైదీ తాను సహజీవనం ( లివ్-ఇన్ రిలేషన్) చేస్తున్న మహిళతో శారీరక సంబంధాన్ని పెంచుకుని పిల్లలను కనడానికి పెరోల్ కావాలని కోర్టుకు మనవి చేశాడు.

పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్న ఖైదీ సోను సోంకర్‌కు జీవిత ఖైదు శిక్ష పడింది. అతనికి పెళ్లయింది. అతనికి మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెరోల్ దరఖాస్తు దాఖలు చేసే సమయంలో సోను సోంకర్ తనకు వివాహమై పిల్లలు ఉన్నారని కోర్టుకు వెల్లడించలేదు.

మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో సహజీవనం చేస్తున్న సోనూ సోంకర్ పెరోల్ పొంది ఆమెతో కలిసి కాలం గడపాలని అనుకున్నాడు. సహజీవనం చేస్తున్న మహిళతో కాపురం చేసి పిల్లలు పుట్టాలనే కోరికతో పెరోల్ కోసం కోర్టులో అర్జీ సమర్పించాడు. చట్టపరంగా ఆమె తన భార్య కాదని కోర్టు ముందు చెప్పలేదు.

సోనూ
పెరోల్ దరఖాస్తును కోర్టు విచారించింది. సోనూ పెరోల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

ఖైదీలకు వివాహ సంబంధాల కోసం పెరోల్ మంజూరు చేయడానికి భారత చట్టం, జైలు నిబంధనలు అనుమతించవని ఢిల్లీ కోర్టు చెప్పింది. చట్టబద్ధంగా పెళ్లయిన భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి పెరోల్ పొందలేడని, అయితే లివ్ ఇన్ పార్ట్‌నర్‌ తో కాపురం చెయ్యడానికి కోర్టు పెరోల్ ఎలా ఇస్తుందని అనుకున్నారు అంటూ సోనూ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. జైలులో ఉన్న ఖైదీ సహజీవనం చేస్తున్న మహిళతో కాపురం చేసి పిల్లలను పుట్టించాలని అనుకోవడంతో కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

దీని ఆధారంగా ఖైదీ సోనూకు పెరోల్ మంజూరు చేయడం సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ్ కాంత శర్మ అన్నారు.
ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న వ్యక్తి, తన మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండా, సహజీవనం చేస్తున్న మహిళతో పిల్లలను కనాలని అనుకోవడమతో అతనికి పెరోల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది, ఇలాంటి విషయంలో సోనూకు పెరోల్ ఇస్తే కోర్టుల్లో ఇలాంటి అర్జీలు కుప్పలు కుప్పలుగా వచ్చిపడతాయని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+