ముంబై నగరంలో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్ (వీడియో)

ముంబై: దేశ అర్థిక రాజధాని ముంబై నగరంలో వరుసగా రెండో రోజు లోకల్ ట్రైన్ పట్టాలు తప్పడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురైనారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

మంగళవారం అంధేరి నుంచి చర్చి గేట్ వైపు లోకల్ ట్రైన్ బయలుదేరింది. మార్గం మధ్యలో విల్లే పార్లీ- అంథేరి స్టేషన్ ల మద్య రైలు పట్టాలు తప్పింది. ఏడు బోగీలు పట్టాల పక్కకు వెళ్లిపోయాయి. ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు వేశారు.

A local train today derailed between Andheri and Vile Parle stations in Mumbai

విషయం తెలుసుకున్న రైల్వే శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులలో ఎవ్వరూ గాయపడలేదని రైల్వే శాఖ పబ్లిక్ రిలేషన్స్ అధికారి శరత్ చంద్రయాన్ చెప్పారు.

రైలు పట్టాలు తప్పడంతో ముంబై నగరంలోని లోకల్ ట్రైన్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం సాయంత్రం ముంబై నగరంలోని చత్రపతి శివాజీ టెర్మినల్ సమీపంలో లోకల్ ట్రైన్ కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎవ్వరికి గాయాలు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+