వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలికపై అత్యాచారం చేసి, పారిపోయిన చర్చి ఫాదర్

|
Google Oneindia TeluguNews

ఎర్నాకులం: బాలిక మీద అత్యాచారం చేసిన చర్చి ఫాదర్ ను పట్టుకునేందుకు కేరళ పోలీసులు పలు రాష్ట్రాలలో అతని కోసం గాలిస్తున్నారు. ఫాదర్ ఎడ్విన్ ఫిగర్జ్ జోసెఫ్ అనే వ్యక్తి పోలీసుల కళ్లు గప్పి 12 రోజుల క్రితం తప్పించుకున్నాడు.

ఎర్నాకులం సమీపంలోని క్యాథలిక్ మాత చర్చిలో ఫాదర్ గా పని చేస్తున్నఎడ్విన్ ఫిగర్జ్ జోసెఫ్ అదే చర్చికి వచ్చి వెలుతున్న 14 సంవత్సరాల బాలిక మీద ఇదే జనవరి నుండి మార్చి నెల మద్యలో ఐదు సార్లు అత్యాచారం చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇతని మీద పదేపదే ఆరోపణలు రావడంతో చర్చి ఫాదర్ విధుల నుండి తప్పించారు. ఎడ్విన్ ముందస్తు బెయిల్ కు హైకోర్టులో అర్జీ సమర్పించాడు. అయితే న్యాయస్థానం ఇతనికి బెయిల్ మంజూరు చెయ్యలేదు. 10వ తరగతి చదువుతున్న బాలిక గత సంవత్సరం నుండి చర్చి ఫాదర్ తో కలసి పని చేస్తున్నది.

a lookout notice for a catholic priest who has allegedly raped a minor girl

చర్చి కార్యకలాపాలలో చురుకుగా పాల్గోంటున్నది. ఇదే అలుసుగా తీసుకున్న ఫాదర్ బాలిక మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టాడు. విషయం బయటకు తెలిస్తే చంపేస్తానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో ఫాదర్ బాలిక మీద అత్యాచారం చేశాడని వెలుగు చూసింది. హై కోర్టులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో ఈనెల 5వ తేదిన ఎడ్విన్ అదృశ్యం అయ్యాడు. అతని కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కేరళ సరిహద్దులతో పాటు అన్ని విమానాశ్రయాలలో ఎడ్విన్ కోసం గట్టి నిఘా వేశారు.

English summary
Kerala High Court on Friday directed the Ernakulam Rural police not to arrest Edwin Figarez a priest with the Lourdes Matha Church.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X