Madhya Pradesh: ఆమె కాంట్రాక్ట్ ఉద్యోగి.. జీతం రూ.30 వేలు.. ఆస్తి రూ.7 కోట్లు..
ఆమె ఓ చిరు ఉద్యోగి.. నెలకు రూ.30 వేల జీతం.. ఆమె 10 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రతిపాదికన పని చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎంత ఆస్తి ఉంటుంది. రూ.50, మహా అయితే కోటి. కానీ ఆమెకు దాదాపు రూ.7కోట్లకుపైనే ఆస్తులున్నాయి. ఇదంతా జీతంతో సంపాందించి కాదు.. లంచాలు తిని పోగేసిన సొమ్ము. తాజాగా ఏసీబీ అధికారులు ఆమె ఇంట్లో తనిఖీలు చేయగా ఈ విషయం బయటపడింది.
మధ్యప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు ఇన్‌చార్జి అసిస్టెంట్ ఇంజనీర్ అయిన హేమ మీనా కేవలం దశాబ్ద కాలం పాటు ఉద్యోగం చేసిన తర్వాత తను. తన కుటుంబం పేరు మీద కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించింది.

భోపాల్‌కు చెందిన హేమా మీనా 2011లో ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ విభాగంలో చేరారు. ప్రస్తుతం ఆమె ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె లంచాలు భారీగా తీసుకుంటున్నట్లు, ఆమెకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు 2020 ఆమెపై కొందరు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కానీ అప్పట్లో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ తాజాగా లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగానికి చెందిన బృందం గురువారం సాధారణ దుస్తుల్లో తనిఖీలు చేపట్టింది.
మీనకు 5-7 లగ్జరీ కార్లు, 20,000 చదరపు అడుగుల స్థలం, బహుమతి పొందిన గిర్ జాతికి చెందిన రెండు డజన్ల పశువులు, రూ.30 లక్షల విలువైన అత్యాధునిక 98 అంగుళాల టీవీతో సహా ఇరవై వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఇంట్లో 100 కుక్కలు కూడా ఉన్నాయి. పూర్తి వైర్‌లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, మొబైల్ జామర్‌లు, ఇతర విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. ఒక్క రోజు తనిఖీలోనే మీన వద్ద రూ.7 కోట్ల ఆస్తులు గుర్తించారు.
ఈ ఆస్తలు ఆదాయ వనరుల కంటే 232 శాతం ఎక్కువ. మీనా మొదట తన తండ్రి పేరు మీద 20,000 చదరపు అడుగుల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. అందులో సుమారు రూ. 1 కోటి విలువైన పెద్ద ఇంటిని నిర్మించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విలాసవంతమైన నివాసంతో పాటు, రైసెన్ విదిశా జిల్లాల్లో కూడా భూమి ఉన్నట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్‌లలో వాడాల్సిన సమాగ్రిని ఆమె తన ఇంటిని నిర్మించడానికి ఉపయోగించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications