వర్మ ‘సత్య’ పాట పాడుకుంటూ ఆత్మహత్య
భోపాల్: రాంగోపాల్ వర్మా తీసిన సంచలన చిత్రం ‘సత్య' సినిమాలో పాట పాడుకుంటూ ఓ యువకుడు నాటు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ లో ఈ సంఘటన జరిగిందని పోలీసులు అన్నారు.
వీరేంద్ర శర్మ అనే వ్యక్తి శుక్రవారం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సత్య సినిమాలోని గోలీ మార్ భేజే మే (తలలో బుల్లెట్ తో కాల్చుకో) అనే పాట పాడుకుంటూ హుషారుగా ఇంటికి వెళ్లాడు. హాల్ లో కుర్చుని భార్యను భోజనం వడ్డించమని చెప్పాడు.
అదే పాట పాడుకుంటు అక్కడే కుర్చున్నాడు. వీరేంద్ర శర్మ భార్య భోజనం తీసుకురావడానికి వంట గదిలోకి వెళ్లింది. అదే సమయంలో వీరేంద్ర శర్మ నాటు తుపాకి తీసుకుని తలలో కాల్చుకున్నాడు.

బుల్లెట్ శభ్దం రావడంతో అతని భార్య పరుగున భయటకు వచ్చింది. అప్పటికే వీరేంద్ర శర్మ రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వీరేంద్ర శర్మ మరణించాడని వైద్యులు చెప్పారు.
వీరేంద్ర శర్మకు నేర చరిత్ర ఉంది. అతని మీద పలు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల నుంచి విముక్తి పొందడం అసాధ్యమని తెలుసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అంటున్నారు. తాను తీసిన సత్య సినిమాలో పాట పాడుకుంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోన్నాడని తెలుసుకుని షాక్ కు గురైనానని రామ్ గోపాల్ వర్మ ట్వీట్టర్ లో పోస్టు చేశాడు.












Click it and Unblock the Notifications