వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొని వ్యక్తి దుర్మరణం- నెల రోజుల్లో రెండోసారి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. గతంలో ఆవులు, గేదెలను వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతను సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు.
నెల రోజుల వ్యవధిలో ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోవడం ఇది రెండోసారి. గతంలో కేరళలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిందటి నెల 20వ తేదీన కోజికోడ్ సమీపంలోని కక్కోడికి చెందిన పరక్కల్ రాజేష్ అనే వ్యక్తి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొని మరణించాడు. ఎలత్తూర్, వెస్ట్‌హిల్ స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్న సమయంలో అతన్ని కాసర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వెళ్తోన్న వందే భారత్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడు.

ఇప్పుడు తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో సరిగ్గా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వారణాశి నుంచి న్యూఢిల్లీకి వెళ్తోన్న రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ మధ్యాహ్నం వారణాశి నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం.. రాత్రి 11 గంటలకు ఢిల్లీకి చేరాల్సి ఉంది. మార్గమధ్యలో ఇటావా జిల్లాలోని జలేసర్- పోరా స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే భద్రత బలగాలు, జనరల్ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం జలేసర్ ఆసుపత్రికి తరలించారు. పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అతన్ని ఢీకొట్టినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.












Click it and Unblock the Notifications