లవ్ మ్యారేజ్: అన్నం ఆల్యస్యం అయ్యింది: భార్యను ఎంత దారుణంగా చంపాడంటే!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: భర్త పని చేస్తున్న చోటకు అన్నం తీసుకెళ్లిన భార్య అతి దారుణ హత్యకు గురైంది. అన్నం ఆలస్యంగా తీసుకు వస్తావా అంటూ రెచ్చిపోయిన భర్త చేతిలో ఉన్న గునపం (గడ్డపార) తీసుకుని భార్య గొంతులో పోడిచి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గ్రామంలో జరిగింది.

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా గౌరీబిదనూరు తాలుకా గుండ్లపల్లి (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు)లో నాగరాజు (30), అమృతా (29) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. భార్య ఇంటిలోనే నాగరాజు నివాసం (ఇల్లరికం) ఉంటున్నాడు.

A man murdered his wife at chikballapu district in Karnataka.

నాగరాజు, అమృత దంపతులకు కుమార్తె (6), కుమారుడు (3) ఉన్నారు. నాగరాజుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఇటీవల నగదు మంజూరు చేసింది. పాత ఇంటికి కొంచెం దూరంలో ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో కొత్త ఇల్లు కట్టుకోవడాని నాగరాజు పునాది తీస్తున్నాడు. బుధవారం కొత్త ఇల్లు నిర్మించే ప్రాంతంలో పని చేస్తున్నాడు.

మద్యాహ్నం అమృత భర్తకు అన్నం, కూరలు తీసుకుని వెళ్లింది. ఆ సందర్బంలో అన్నం ఆలస్యంగా తీసుకు వస్తావా అంటూ భార్యతో గొడవ పెట్టుకున్ని నాగరాజు ఆమె మీద దాడి చేశాడు. కిందపడిన భార్య అమృత గొంతులో గునపంతో పొడిచాడు. గొంతులో నుంచి గునపం అటువైపుకు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. హత్య చేసిన నాగరాజు తప్పించుకుని పారిపోయాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man murdered his wife at chikballapu district in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి