షాక్: దేవుడినంటూ బస్సులోనే విధ్యార్థినులపై లైంగిక వేధింపులు

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరువనంతపురం: కేరళలో ఓ వ్యక్తి కాలేజీ బస్సులో ప్రయాణీస్తూ విధ్యార్థినుల పట్ల అసభ్యగా ప్రవర్తించాడు. అయితే ఆ వ్యక్తి ప్రవర్తనను ఫోన్ లో రికార్డు చేసి ఫేస్ బుక్ లో పోస్టు చేశారు విధ్యార్థులు ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

కేరళ రాష్ట్రంలోని కోడికోడ్ లోని రమణట్టు కారా ప్రాంతంలో బుదవారం ఓ వ్యక్తి బస్సు ఆపి డ్రైవర్ పై చేయిచేసుకొన్నాడు.అయితే అనంతరం తనకు చాలా పలుకుబడి ఉందని చెబుతూ బస్సులో ఉన్న అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు.

a man sexual harassment on girls in college bus

నేను దేవుళ్ళకే దేవుడిని అంటూ కాలేజీ బస్సులో ఆ వ్యక్తి వింతగా ప్రవర్తించాడు. బస్సును ఆపి డ్రైవర్ పై చేయి చేసుకొన్నాడు. బస్సు దిగిపోవాలని డ్రైవర్ పై దాడి చేసినట్టుగా విధ్యార్థులు చెబుతున్నారు.తనకు పలుకుబడి ఉందంటూనే ఆయన విధ్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

అంతేకాదు ఓ అమ్మాయిని పట్టుకొని నేను మీ కాలేజీని తిరిగి నిర్మిస్తాను,. నాకు నచ్చినట్టుగానే కాలేజీని నడిపిస్తానంటూ చెప్పాడు.సినీ నటి మంజు వారియర్ ను పెళ్ళిచేసుకొంటా అంటూ ఆయన చెప్పడం వరకు విధ్యార్థులు పోస్ట్ చేసిన వీడియో ఫేస్ బుక్ లో వైరల్ గా మారింది.అతణ్ణి అరెస్టు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a man sexual harassment on girls in college bus on wednes day,this incident happened in kerala state. that man attacked on bus driver. college students recorded a video,post on face book.
Please Wait while comments are loading...