మీ కూతురు చచ్చిపోయింది. వచ్చి చూసిపోండి, అత్తకు ఫోన్ చేసిన అల్లుడు !
బెంగళూరు/చిక్కమగళూరు/ మండ్య: పెద్దలు మాట్లాడుకుని యువతి, యువకుడికి పెళ్లి చేశారు. దంపతులు ఇన్ని సంవత్సరాలు సంతోషంగా ఉన్నారని తెలిసింది. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. ఇదే సమయంలో మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు అల్లుడు ఫోన్ చేసి చెప్పాడు.
కర్ణాటకలోని మండ్య జిల్లాలోని రాగిముద్దేనహళ్లి గ్రామంలో రుక్మిణి (33) అనే మహిళ నివాసం ఉండేది. చిక్కమగళూరులోని కడూరులో నివాసం ఉంటున్న కన్నన్ అనే వ్యక్తితో 13 ఏళ్ల క్రితం రుక్మిణి వివాహం జరిగింది. వివాహం చేసుకున్న తరువాత రుక్మిణి ఆమె భర్త కన్నన్ తో కలిసి మండ్యలోని పుట్టింటికి వచ్చి వెళ్లేది.

కన్నన్, రుక్మిణి దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన తరువాత రుక్మిణి ఆమె భర్తతో సంతోషంగానే ఉండేదని తెలిసింది. అయితే ఇటీవల రుక్మిణి, కన్నన్ దంపతుల మధ్య గొడవలు మొదలైనాయని తెలిసింది. మండ్య నుంచి చిక్కమళూరు జిల్లాలోని కడూరులోని కూతురు ఇంటికి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులు రాజీ పంచాయితీలు చేసి వచ్చారని తెలిసింది.

ఆదివారం సాయంత్రం కన్నన్ రుక్మిణి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మండ్య నుంచి కడూరు వెళ్లిన రుక్మిణి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మా కూతురు రుక్మిణి ఆత్మహత్య చేసుకోలేదని, అమెను చంపేశారని, ఆమె అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిందని ఆరోపిస్తూ చిక్కమగళూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు రుక్మిణి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. కేసు విచారణలో ఉందని కడూరు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications