Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భర్తకు బాయ్ బాయ్, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో ?, ఫస్ట్ ప్రియుడికి కాలిపోయి ఇద్దర్ని !

బెంగళూరు/అనంతపురం: యువతి, యువకుడికి పెళ్లి ఫిక్స్ చేశారు. పెద్దల జరిపించిన దంపతులు హ్యాపీగా కాపురం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లల పుట్టిన తరువాత భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగించింది. ప్రియురాలు మరో వ్యక్తితో అక్ర సంబంధం పెట్టున్న ప్రయియురాలు ప్రియుడికి తెలీకుండా మరో ప్రియుడితో రొమాన్స్ చేసింది. దెబ్బకు తల్లీకొడుకు హత్యకు గురి కావడం కలకలం రేపింది.

బెంగళూరులో జరిగిన తల్లీకొడుకుల జంట హత్యల కేసులో మహిళ మొదటి ప్రేమికుడిని బాగల్‌గుంటె పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని కువెంపునగర్‌కు చెందిన శేఖర్‌ అలియాస్‌ శేఖరప్ప(38) అనే నిందితుడిని అరెస్టు చేశామని శనివారం పోలీసులు తెలిపారు. నిందితుడు శేఖర్ బెంగళూరులో ఎలక్ట్రీషియన్‌గా పని చేశాడు.

A married woman who had an affair and a boyfriend who killed her son in Bengaluru.

బెంగళూరులోని బాగల్‌గుంటె రవీంద్రనగర్‌లోని గుడ్డెలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంకు చెందిన నవనీత (35), ఆమె కుమారుడు సాయి సృజన్‌ (8) అనే బాలుడిని హత్య చేసిన ప్రియడు శేఖర్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. తల్లీ కుమారుడు జంట హత్యలు జరిగిన ఇంటిలో ఘటనా స్థలంలో ప్రత్యేక టీమ్ పోలీసులు టెక్నాలజీ ఉపయోగం సాంకేతిక సమాచారం అందడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకు చెందిన నవనీత, చంద్రు దంపతులకు సాయి సృజన్, సాయి అభిషేక్ అనే కుమారులు ఉన్నారు. అనంతపురం నుంచి ఎనిమిదేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చిన చంద్రు, నవనీత దంపతులు టీ. దాసరహళ్లిలోని ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. మొదట భార్య నవనీత్ తో ఆమె భర్త చంద్రు సంతోషంగానే ఉండేవాడని తెలిసింది.

A married woman who had an affair and a boyfriend who killed her son in Bengaluru.

నవనీత్, చంద్రు దంపతుల మరో కుమారుడు అభిషేక్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఓ హాస్టల్‌లో చేర్చించారు. నవనీత్ భర్త చంద్రు మద్యానికి బానిస అయ్యి భార్య, కుమారుడిని పట్టించుకోవడం మానేశాడు. భర్త చంద్రును మార్చడానికి అతని భార్య నవనీత అనేక ప్రయత్నాలు చేసింది. అయితే చంద్రు మాత్రం అతని పద్దతి మార్చుకోలేదని తెలిసింది.

ఇలా రెండేళ్లుగా విపిగిపోయిన నవనీత ఆమె భర్త చంద్రును వదిలేసి కుమారుడు సాయి సృజన్‌తో కలిసి రవీంద్రనగర్‌ గుడ్డే అనే ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటోందని పోలీసు అధికారులు అంటున్నారు. ఓ ప్రైవేట్ కాల్ సెంటర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నవనీత్ ఆమె కుమారుడిని పెంచి పోషిస్తున్నదని తెలిసింది.

భర్త చంద్రుకు దూరంగా ఉంటున్న నవనీతకు ఎలక్ట్రీషియన్ అయిన శేఖర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. రానురాను శేఖర్, నవనీత్ మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడి తరువాత అక్రమ సంబంధానికి దారితీసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇటీవలే నవనీతకు లోకేష్‌ అనే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తరువాత నవనీత లోకేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని పోలీసులు అంటున్నారు.

A married woman who had an affair and a boyfriend who killed her son in Bengaluru.

ప్రియురాలు నవనీతకు మరో ప్రియుడు లోకేష్ ఉన్నాడని ఆమె మొదటి ప్రియుడు శేఖర్ కు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న శేఖర్ నవనీతతో నిత్యం గొడవపడ్డాడు. రాత్రి నవనీత ఇంటికి వచ్చిన శేఖర్ లోకేష్ విషయాన్ని లేవనెత్తి గొడవ పడ్డాడు. ఈ సమయంలో నవనీత, ఆమె మొదటి ప్రియుడు శేఖర్ ల గొడవ హింసాత్మకంగా మారింది. ఆ సమయంలో శేఖర్ కత్తితో ప్రియురాలు నవనీతను గొంతు కోసి ఆమెను చంపేశాడు.

తరువాత శేఖర్ అతని ప్రియురాలు నవనీత కుమారుడు సాయి సృజన్‌ను దిండుతో ఊపిరాడకుండా చేశాడు. అనంతరం నవనీత ఇంటి వంటగదిలోని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఇంటి బయట నుంచి తాళం వేసిన శేఖర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు మధ్యాహ్నం నవనీత ఇంట్లో నుంచి గ్యాస్ లీకేజీ వాసన రావడంతో స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు నవనీత ఇంటికి చేరుకుని తలుపులు పలగొట్టి చూడగా తల్లీ కుమారుడి జంట హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై మృతురాలి నవనీత తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు శేఖర్‌ను అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. తనను మోసం చేసిన నవనీత మరో ప్రియుడిని సెట్ చేసుకున్నందుకు చంపేశానని శేఖర్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+