ర్యాపిడో క్యాబ్ లో గర్భిణికి నొప్పులు.. డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే షాక్..!
పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి క్యాబ్ డ్రైవర్ అండగా నిలిచాడు. అతడి సహకారంతో ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అయింది. క్యాబ్ డ్రైవర్ మానవత్వానికి అంతా ఫిదా అయ్యారు. అందరూ అతడ్ని హీరో అంటూ పొగిడేస్తున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్ లో జరిగింది. ఓ వ్యక్తి తన సామాజిక మాధ్యమైన రెడ్డిట్. కామ్ లో ఈ స్టోరీని పంచుకోవడం వల్ల ఈ ఘటన బయటకు వచ్చింది.

హరియాణా లోని గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో పనిచేసే కుటుంబంలో ఓ మహిళకు ఫిబ్రవరి 19 రాత్రి 11 గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. అయితే ఆ ఇంటి యజమాని ర్యాపిడో క్యాబ్ బుక్ చేశారు.క్యాబ్ వచ్చి ఆమెను అందులో ఎక్కించారు. గర్భిణి వెంట ఆమె భర్త, ఇంటి యజమాని ఉన్నారు. క్యాబ్ కొద్ది దూరం వెళ్లేసరికే ఆమెకు నొప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో క్యాబ్ ను పక్కకు నిలిపి ఆమె ప్రసవించేందుకు క్యాబ్ డ్రైవర్ వికాస్ సహకరించాడు. దీంతో క్యాబ్ లోనే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి వికాస్ తీసుకెళ్లాడు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆ ఇంటి యజమాని పేర్కొన్నాడు.
ఈ మేరకు క్యాబ్ డ్రైవర్ వికాస్.. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. వికాస్ ఎలాంటి అదనపు ఛార్జీ కూడా తీసుకోలేదని ఆ ఇంటి యజమాని తెలిపాడు. అంతేకాక ఈ సంఘటనను తన సామాజిక మాధ్యమం రెడ్డిట్. కామ్ సైట్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చదివిన నెటిజెన్లు వికాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వికాస్ ర్యాపిడో హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేవుడు అతడ్ని చల్లగా చూడాలని థంబ్స్ అప్ సింబల్ ఈమోజీ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications