baby: ఆసుపత్రిలో తల్లి పక్కన నిద్రపోయిన బిడ్డను ఎత్తుకెళ్లి చంపేసిన కుక్కలు, సీసీటీవీల్లో ?
ఆసుపత్రి వార్డులో రాత్రి తల్లి పక్కన పడుకున్న నెల రోజుల వయసు ఉన్న శిశువును వీధికుక్కలు ఎత్తుకెళ్లి కరిచి చంపేశాయి. ఆస్పత్రి వార్డు బయట చిన్నారి మృతదేహం లభ్యమైంది.
జైపూర్/రాజస్థాన్: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఏకంగా ఆసుపత్రిలోకి వెళ్లిన వీధికుక్కలు నెల రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేశాయి. రాజస్థాన్ లోని సిరోహిలో ఆసుపత్రి వార్డులో రాత్రి తల్లి పక్కన పడుకున్న నెల రోజుల వయసు ఉన్న శిశువును వీధికుక్కలు ఎత్తుకెళ్లి కరిచి చంపేశాయి. ఆస్పత్రి వార్డు బయట చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఆసుపత్రి వార్డులోకి రెండు కుక్కలు ప్రవేశించాయి. ఓ కుక్క పిల్లవాడిని నోటితో కొరికి, పట్టుకుని తిరిగి వస్తుండగా సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యిందని పోలీసులు తెలిపారు.

అనారోగ్యంతో ఆసుపత్రిలో తండ్రి
క్షయవ్యాధితో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన పాప తండ్రితో పాటు తల్లి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆస్పత్రిలో ఉండగా ఈ సంఘటన జరిగిదని వెలుగు చూసింది. ఆసుపత్రి సిబ్బంది ఎవ్వరుకూడా వార్డులో లేకపోవడం, వాచ్‌మెన్ కూడా మరో వార్డుకు వెళ్లడంతో చిన్నారిని వీధి కుక్కులు ఎత్తుకెళ్లాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ సంఘటనపై విచారణ ప్రారంభించామని పోలీసులు అంటున్నారు.

రాత్రి చిన్నారి తల్లి నిద్రపోయింది
చిన్నారి తండ్రి మహేంద్ర మీనా సిలికోసిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని కొత్వాలి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీతారామ్ స్థానిక మీడియాకు తెలిపారు. ఆ సమయంలో తన ముగ్గురు పిల్లలతో భర్త సమీపంలో ఉన్న చిన్నారి తల్లి రేఖా కూడా నిద్రపోయిందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రి సిబ్బంది కూడా వార్డులో లేరని పోలీసు అధికారి తెలిపారు.

ఖాళీ కాగితాలపై సంతకాలు చేపించుకున్నారు
చిన్నారి శవానికి పోస్టుమార్టం నిర్వహించామని, తదుపరి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
ఖాళీ కాగితాలపై సంతకం చేసి తన బిడ్డకు అంత్యక్రియలు చేయమని ఆసుపత్రి అధికారులు, పోలీసులు తనను బలవంతం చేశారని, ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని బెదిరించారని చిన్నారని తల్లి రేఖా ఆరోపించిందని స్థానిక మీడియా తెలిపింది. సోమవారం రాత్రి ఆసుపత్రిలో వార్డు లోపలికి కుక్కలు వస్తూనే ఉన్నాయని, నేను వాటిని తరిమికొట్టానన చిన్నారి తండ్రి మహేంద్ర మీనా విలపిస్తున్నాడు.

మ్యాటర్ బయటకు రాకుండా చేశారు ?
తెల్లవారుజామున 2 గంటలకు మేల్కొన్న నా భార్య రేఖా కుక్కలు మా బిడ్డను ఎత్తుకెళ్లాయని అనుమానం వచ్చి బయటకు వెళ్లి చూస్తే కుక్కలు బిడ్డను కొరికేస్తున్నాయని మహేంద్ర మీనా అంటున్నారు. ఈరోజు ఆసుపత్రి అధికారులు, పోలీసులు నాకు సమాచారం ఇవ్వకుండా ఖాళీ కాగితంపై నా భార్య రేఖా దగ్గర సంతకం తీసుకుని నా కొడుకును దహనం చేశారు. చివరిసారిగా నా బిడ్డ ముఖం కూడా చూడలేకపోయాను అని మహేంద్ర మీనా ఆరోపిస్తున్నాడు. .
మరోవైపు ఈ ఘటనపై ఆస్పత్రి యంత్రాంగం మేము కూడా విచారణ ప్రారంభించామని స్థానిక మీడియాకు చెప్పింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications