చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ ఏరియల్ సర్వే: గ్రాఫిక్ ఫోటోతో పరువు తీశారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ చెన్నై: తమిళనాడులో భారీ వరదల కారణంగా ఎంత నష్టం జరిగింది, పరిస్థితి ఏమిటి అని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం ఏరియల్ సర్వే చేశారు. అనంతరం తమిళనాడు ముఖ్య మంత్రి కుమారి జయలలితతో చర్చించారు.

గవర్నర్ రోశయ్యతో సమావేశం అయ్యారు. మీకు అండగా మేము ఉంటామని, తమిళ ప్రజలను ఆదుకుంటామని హామి ఇచ్చారు. తక్షణం రూ. 1,000 కోట్లు పరిహారం ప్రకటించారు. ఇంత వరకు అంతా బాగానే ఉంది.

అయితే ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయ సిబ్బంది ఏరియల్ సర్వే ఫోటోలను అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేశారు. నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే చేసిన సమయంలో మబ్బులు ఎక్కువగా ఉండటంతో వరద నీరు, చెన్నై నగరం స్పష్టంగా కనపడలేదు.

మోడీ ఏరియల్ సర్వే: గ్రాఫిక్ ఫోటోతో పరువు తీశారు

అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి గ్రాఫిక్స్ తో చెన్నై నగరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ హెలికాప్టర్ నుంచి చూస్తున్నట్లు డిజైన్ చేశారు.

మోడీ ఏరియల్ సర్వే: గ్రాఫిక్ ఫోటోతో పరువు తీశారు

ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోకుండా గుడ్డిగా సోషల్ మీడియాలో పెట్టారు.

మోడీ ఏరియల్ సర్వే: గ్రాఫిక్ ఫోటోతో పరువు తీశారు

అంతే అది గ్రాఫిక్స్ ఫోటో అని స్పష్టంగా తెలిసిపోయింది. నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

మోడీ ఏరియల్ సర్వే: గ్రాఫిక్ ఫోటోతో పరువు తీశారు

మీరు డిజిటల్ ఇండియా చేస్తామని చెప్పారు కాని ఇలా డిజిటల్ ఫోటోలు పెట్టి ప్రజల చెవిలో పూలు పెడుతారని అనుకోలేదని విమర్శించారు.

మోడీ ఏరియల్ సర్వే: గ్రాఫిక్ ఫోటోతో పరువు తీశారు

తేరుకున్న అధికారులు ఆ ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. విషయం ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి వెళ్లింది.

మోడీ ఏరియల్ సర్వే: గ్రాఫిక్ ఫోటోతో పరువు తీశారు

సంబంధిత అధికారులను పిలిచి చివాట్లు పెట్టారు. ఇక మీద జాగ్రత్తగా ఉండాలని మోడీ వారిని హెచ్చరించారని సమాచారం.

English summary
The photograph, the original of which it tweeted an hour before, showed PM Modi looking out of the aircraft window during his aerial survey of Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X