బ్లేడ్ తో నెల రోజు బిడ్డ గొంతు కోసి చంపేసిన కన్న తల్లి, నర్సు మేడమ్ టెక్నిక్ !
చెన్నై/ మదురై: పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. వివాహం జరిగిన చాలా సంవత్సరాల వరకు దంపతుకు పిల్లలు పుట్టలేదు. వివాహం అయినా పిల్లలు పుట్టకపోవడంతో దంపతులకు వివిద ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. భార్య నర్సు అయినా పిల్లలు పుట్టలేదు. నెల రోజుల ముందే దంపతుకు మగ బిడ్డపుట్టాడు.

నెల రోజుల చిన్నారిని సొంత తల్లి బ్లేడ్ తో గొంతు కోసి చంపిన ఘటన తమినాడులో కలకలం రేపింది. మదురై జిల్లా వడిపట్టి సమీపంలోని చల్లక్కుళానికి చెందిన శివరాజ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. శివరాజ్ భార్య జీవిత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. వీరిద్దరికి పెళ్లి అయ్యి 8 ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదని వారి కుటుంబ సభ్యులు అన్నారు. అనేక ఆసుపత్రుల్లో చికిత్స చేసుకోవడంతో గత నెలలో శివరాజ్, జీవిత దంపతులకు మగబిడ్డ పుట్టాడు.

చిన్నారి ఆరోగ్యం బాగోలేక తరుచూ ఏడుస్తూ చర్మవ్యాధితో బాధపడుతున్నాడని సమాచారం. 9 మాసాలు మోసిన కన్న బిడ్డను చూసి నర్సు జీవితం విరక్తి పెంచుకుంది. దీంతో బిడ్డ తల్లి జీవిత బ్లేడుతో చిన్నారిని గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించింది. అప్పుడు తొట్టిలో చిన్నారి మెడ నుంచి రక్తం వస్తోందంటూ జీవిత డ్రామాలాడింది. ఆ సందర్భంలో చికిత్స అందించడానికి కుటుంబ సభ్యులు బిడ్డను ఎత్తుకుని ఆసుపత్రికి బయలుదేశారు.

బిడ్డను పరీక్షించిన వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనిపై వైద్యులకు అనుమానం రావడంతో వెంటనే వడ్డిపట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జీవితను అదుపులోకి తీసుకుని ఆమెను సీరియస్‌గా విచారించారు. చిన్నారి గొంతును బ్లేడ్ తో కోసి హత్య చేసినట్లు జీవిత అంగీకరించింది. ఈ కేసులో జీవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు సీరియస్ గా విచారణ జరుపుతున్నారు. కన్నబిడ్డ అనారోగ్యంతో ఉండటంతో ఆబిడ్డను అతి దారుణంగా కన్న తల్లి హత్య చెయ్యడం మదురైలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications