ఒకే ఫ్యామిలీలో 15 నిమిషాల్లో తల్లీ, ముగ్గురు పిల్లలను చంపేశాడు, క్లూ ఇచ్చిన ఆటో డ్రైవర్ !

బెంగళూరు: కర్ణాటకను ఓ సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా కేవలం 15 నిమిషాల్లో హత్య చేసిన ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటుచేసుకుంది. హంతకుడి కోసం ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఒకే ఇంటిలోని అందరిని పక్కాప్లాన్ తో చంపేసిన నిందితుడు బెంగళూరుకు జంప్ అయ్యాడు.

స్థానిక ఆటో డ్రైవర్ హంతకుడి క్లూ పోలీసులకు అందించినా హంతకుడు మాత్రం తప్పించుకున్నాడని వెలుగు చూసింది. దీంతో ఈ నాలుగు హత్యల కేసుపై పోలీసులకు ఓ క్లూ లభించింది.ఉడిపి జిల్లా మల్పే పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రిప్తి నగర్‌లోని ఓ ఇంటిలో ఆదివారం నాలుగు హత్యలు జరిగాయని, హత్యకు గురైన కుటుంబానికి హంతకుడు పరిచయం ఉన్నాడని తెలిసిందని పోలీసులు అంటున్నారు.

A murderer who brutally murdered a mother and three children in the same family in Udupi,

హసీనా (46), అఫ్నాన్ (23), అయినజ్ (21), అసీమ్ (12) అనే నలుగురిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన హంతకుడు పరారయ్యాడు. ఒకే ఘటనలో తల్లి, ముగ్గురు పిల్లలు హత్యకు గురి కావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒకే ఫ్యామిలీలోని నాలుగు హత్యల వెనుక అసలు కారణం ఏమిటి అని అంతు చిక్కకపోవడంతో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే ఫ్యామిలీలో నలుగురిని చంపేసిన హంతకుడి కోసం పోలీులు గాలిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే ఫ్యామిలీలో నలుగురిని చంపేశారని పోలీసులు అంటున్నారు. ఓ ఆటో డ్రైవర్ హంతకుడిని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. హత్య చేసిన నిందితుడు నా ఆటోలో హత్యలు జరిగిన ఇంటికి వెళ్లారని సంతేకట్టెకు చెందిన రిక్షా డ్రైవర్ శ్యామ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

నిందితులు సంతే కట్టె నుంచి హత్య జరిగిన ఇంటి చిరునామాను చెప్పాడు. అయితే మార్గం మధ్యలో నేను దారి తప్పి ఆ దారిలో కాకుండా పక్క రోడ్డులో వెళ్దానని, అయితే తరువాత హంతకుడు తనను మరో రోడ్డులో వెళ్లాలని చెప్పి అతడే ఇంటి దారి చూపింి నేరుగా నాలుగు హత్యలు జరిగిన ఇంటి ఇంటి దగ్గరికి పిలుచుకుని వెళ్లాడని ఆటో డ్రైవర్ శ్యాక్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

A murderer who brutally murdered a mother and three children in the same family in Udupi,

తనకు డబ్బులు ఇచ్చిన తరువాత హంతకుడు హత్యలు జరిగిన ఇంటికి వెళ్లాడని, తన ఆటోలో ఎక్కిన వ్యక్తికి దాదాపు 45 ఏళ్లు ఉండొచ్చు అని, బ్రౌన్ కలర్ షర్ట్, ముఖానికి తెల్లటి మాస్క్ వేసుకున్నాడు, అతను చెప్పిన ఇంటి దగ్గర అతన్ని వదిలేసి తాను ఆటో స్టాండ్ దగ్గరకు వెళ్లిపోయానని ఆటో డ్రైవర్ శ్యామ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

హత్యలు జరిగిన ఇంటికి వెళ్లిన 15 నిమిషాల్లోనే అతని అతను సంతకట్టెలోని ఆటో స్టాండ్‌ దగ్గరకు వచ్చాడని, ఆ సమయంలో అతను ఆందోళన చెందుతూ తనను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ఆటో ఎక్కాడని, తరువాత వేరే ప్రాంతానికి తన ఆటోలనే అతను వెళ్లాడని, బెంగుళూరు ప్రజలు మాట్లాడే కన్నడ అతను తనతో మాట్లాడాడని ఆటోడ్రైవర్ శ్యామ్ చెప్పాడని పోలీసులు అంటున్నారు.

ఒకే ఫ్యామిలీలో నలుగురు హత్యకు గురి అయిన విషయం ఊరు మొత్తం తెలిసిపోవడంతో ఆటో డ్రైవర్ శ్యామ్ స్వయంగా వచ్చిన హంతకుడి వివరాలు చెప్పాడని పోలీసులు అంటున్నారు. ఉడిపి ఎమ్మెల్యే యశ్‌పాల్, ఉడిపి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హంతుకుడి కోసం ప్రత్యేక టీమ్ లో ఏర్పాటు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+