బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముస్లీం మహిళకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరణ: ఏం న్యాయం. నా దేశంలోనే ఇలా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఖాలీగా ఉన్న ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఇంటి యజమానులు నిరాకరించడంతో బెంగళూరులోని ఓ మహిళ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీరు ముస్లీంలు అందుకే ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదని యజమానులు అంటున్నారని ఆ ముస్లీం మహిళ విచారం వ్యక్తం చేస్తున్నారు.

పండగ సెలవుల నుంచి పని బాట...అంతా ఒకేసారి రాక:ఎటు చూసినా జనంతో కిటకిట...ప్రయాణ కష్టాలు పండగ సెలవుల నుంచి పని బాట...అంతా ఒకేసారి రాక:ఎటు చూసినా జనంతో కిటకిట...ప్రయాణ కష్టాలు

తనకు ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ఇద్దరు ఇంటి యజమానులు నిరాకరించారని ఆ ముస్లీం మహిళ ట్వీట్ చెయ్యడంతో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించిన ఇంటి యజమానులతో పాటు ఆన్ లైన్ వెబ్ సైట్ నిర్వహకుల తీరుపై మహిళ మండిపడుతున్నారు.

A muslim women alleged that two house owners in Bengaluru refused to rent house for her.

బెంగళూరు నగరంలో సర్వసాదారణంగా ఇంటి ముందు టూ లెట్ బోర్డు వేసి ఉంటే దాదాపు శాఖాహారులకు మాత్రమే ఇల్లు అద్దెకు ఇస్తామని బోర్డు మీదరాసి పెడుతుంటారు. ఓ ముస్లీం మహిళ ఆన్ లైన్ లో ఇంటిని చూసి ఇష్టపడింది.

వెంటనే ఇంటి యజమానిని ఫోన్ లో సంప్రధించింది. ఆ సమయంలో తన పేరు, వివరాలు తెలుసుకున్న ఇంటి యజమాని మేము ముస్లీంలకు ఇంటిని అద్దెకు ఇవ్వమని కచ్చితంగా చెప్పారని ఆ మహిళ ఆరోపిస్తున్నారు.

మరో ఇంటి యజమానికి ఫోన్ చేసి వివరాలు చెప్పినా ఇదే సమాదానం వచ్చిందని ఆ మహిళ ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు పెట్టిన వెబ్ సైట్ మీద ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పంధించిన వెబ్ సైట్ నిర్వహకులు ఆ మహిళలకు మద్దతు తెలిపారు.

వెంటనే రెండు ఇండ్ల ప్రకటనలు తమ వెబ్ సైట్ నుంచి తొలగిస్తున్నామని, మీకు మద్దతుగా ఉంటామని వెబ్ సైట్ నిర్వహకులు హామీ ఇచ్చారని ఆ మహిళ సోషల్ మీడియాలో తెలిపింది. కేవలం తాను ముస్లీం మహిళ అని మాత్రమే ఇల్లు అద్దెకు ఇవ్వడంలేదని, తాను పుట్టిన దేశంలోనే తనకు ఇల్లు అద్దెకు ఇవ్వకపోతే ఇక బయటి దేశాల్లో మా పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

English summary
A muslim women alleged that two house owners in Bengaluru refused to rent house for her. In a twitter she alleged that irrational hindu house owner can judge me without even talking to me.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X