వందల కోట్ల ఆస్తికి యజమాని, ఫ్యామిలీ మొత్తానికి స్పాట్ పెట్టిన మహిళ, ఇంట్లో పని చేస్తూ?
రాజస్థాన్ లోని ఉదయపూర్ జిల్లాలోని సుఖేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ బంగ్లాలో నివసిస్తున్న కోటీశ్వరుడు గత 20 గంటలుగా అపస్మారక స్థితిలో ఉండటంతో రాజస్థాన్ నుంచి నేపాల్ వరకు హై అలర్ట్ ప్రకటించారు. వందల కోట్ల ఆస్తులకు అదిపతి అయిన వరుణ్ గాంధీ, ఆయన సతీమణి శిల్పా గాంధీ కోలుకోవాలని వాళ్ల కుటుంబ సభ్యులు, పోలీసులు ఎదురుచూస్తున్నారు.
వరుణ్, శిల్పా అర్ధరాత్రి 1 గంటల నుండి స్పృహ కోల్పోయారు ఇద్దరిలో ఎలాంటి స్పందన లేదని పోలీసులు అంటున్నారు. వరుణ్, శిల్పా దంపతుల పిల్లలు, 18 ఏళ్ల కుమార్తె నిహారిక, 10 ఏళ్ల కుమారుడు శౌర్య ఆందోళన చెందుతున్నారు. పిల్లలు ఇద్దరూ మాట్లాడటానికి కూడా భయపడుతున్నారని పోలీసులు అన్నారు. శౌర్య ఇప్పుడు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. నిహారిక మాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తోందని పోలీసు అధికారులు అంటున్నారు.

ఈ సంఘటనతో రాజస్థాన్ లోని ఉదయపూర్ నుండి నేపాల్ వరకు అలర్ట్ ప్రకటించారు. ఉదయ్‌పూర్ ఎస్పీ యోగేష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ వరుణ్, శిల్పా దంపతులు కోలుకోవాలని, వారి నుంచి వివరాలు తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. స్థానిక మీడయా నివేదికల ప్రకారం ఉదయ్ పూర్ నుంచి నేపాల్ వరకు పోలీసులు నాకాబంధీ నిర్వహఇంచి అన్ని వాహనాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
వరుణ్ ఇంట్లో పని చేసేందుకు కరిష్మా అనే మహిళను పనిలో పెట్టుకున్నారు. పరిచయం ఉన్న ఓ వ్యక్తి ద్వారా వరుణ్ కు, కరిష్మాతో పరిచయం అయ్యింది. కరిష్మా నేపాల్ కు చెందినదని అని వెలుగు చూసింది. వరణ్ ఇంట్లో వంటతో సహా ఇంటిపని చేస్తుంది. కరిష్మా ఇంట్లో అందరితో కలిసి పనిచేసేది. మా అందరికీ ఆమె వంట నచ్చిందని నిహారిక పోలీసులకు చెప్పింది.
కరిష్మా సోమవారం రాత్రి కూడా వంట చేసింది. మేము కూడా భోజనం చేశాము అని వరుణ్ కుమార్తె నిహారిక పోలీసులకు చెప్పింది. మేము భోజనం చెయ్యడాకి ముందు ముగ్గురు వ్యక్తులు కరిష్మాను కలవడానికి వచ్చారు. ముగ్గురు నేపాల్‌కు చెందిన వారు. మా ఇంటికి కరిష్మా కోసం వచ్చారని నిహారిక పోలీసులకు చెప్పింది. రాత్రి భోజనం చేసిన తర్వాత మాలో ఎవరూ స్పృహలో లేరని వరుణ్ గాంధీ కుమార్తె నిహారిక పోలీసులకు సమాచారం అందించింది.
వరుణ్ కుటుంబం నివసించే సొసైటీ వికాస్ సమితి అధ్యక్షుడు వివేక్ సింగ్ రాజ్‌పుత్ ఈ సంఘటన గురించి పోలీసులకు తెలియజేశారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నిద్రలేచి చూసేసరికి నిహారిక కిటికీలో సైగలు చేస్తూ కనిపించింది. నిశితంగా పరిశీలిస్తే ఆమె కాళ్లు కట్టివేశారని, వెంటనే నా భార్యను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లి నిహారికు కాళ్లకు కట్టిన కట్లు విడిపించామని వికేక్ సింగ్ రాజ్ పుత్ పోలీసులకు చెప్పాడు.
మమ్మల్ని చూడగానే నిహారిక పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. నిహారిక ఏడుస్తోంది. కరిష్మా మా ఇంట్లో పని చేస్తోందని, అన్నం తిన్నాక కరిష్మా ఇంట్లో మా అందరి చేతులు, కాళ్లు కట్టేశారని వివేక్ సింగ్ రాజ్‌పుత్ కు నిహారిక చెప్పింది. రాత్రిపూట తక్కువ భోజనం తినడం వల్లే నిహారిక చాలా సేపు స్పృహ కోల్పోలేదని పోలీసుల విచారణలో తెలిసింది.
ఆహారంలో స్పృహ కోల్పోయే మత్తు మందులు కలపారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పోలీసులు అన్నారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై విచారణ జరుపుతున్నారు. వరుణ్ గాంధీకి ఉదయపూర్ తో సహ రాజస్థాన్‌లోని అనేక నగరాల్లో ఖనిజాల పరిశ్రమలు ఉన్నాయి. ఇది కాకుండా అనేక రాష్ట్రాల్లో వరుణ్ కు వ్యాపారాలు ఉన్నాయి. కరిష్మా వెనుక పెద్ద గ్యాంగ్ ఉన్నట్లు అనుమానాలున్నాయని ఎస్పీ యోగేష్ గోయల్ మంగళవారం మీడియాకు తెలిపారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications